మూసీ న‌ది తీరం వెంట‌ రైలు నిర్మాణానికి ప్లాన్‌!

Moosi Riverfront redevelopment in Hyderabad may see metro or mono rail and a mega township by Emaar. Project aims to transform Hyderabad real estate by 2026.

Dec 27, 2025 - 01:20
 0  3
మూసీ న‌ది తీరం వెంట‌ రైలు నిర్మాణానికి ప్లాన్‌!
moosi-riverfront-redevelopment-hyderabad-emaar-metro-rail
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై
దుబాయ్ కంపెనీ ఎమ్మార్ ఆసక్తి

హైదరాబాద్ పరిధిలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు.. ప్ర‌భుత్వం చ‌కచ‌కా అడుగులు ముందుకేస్తోంది. లండ‌న్‌, సియోల్ త‌ర‌హాలో ఈ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల‌ని సంక‌ల్పించిన రేవంత్ స‌ర్కార్‌.. సుమారు నాలుగు వేల కోట్ల రూపాయ‌ల‌తో స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ను రూపొందిస్తోంది. గాంధీ సరోవర్ పేరుతో బాపూఘాట్ అభివృద్ధి పనుల్ని చేపట్టాలని నిర్ణ‌యించిన విషయం తెలిసిందే. మూసీ నది మీద ప‌దిహేడు కొత్త ఫ్లై ఓవర్ల నిర్మాణాల్ని చేప‌ట్టాల‌ని.. రైలు మార్గాన్ని అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. అయితే, మోనో రైలును నిర్మిస్తారా.. మెట్రో రైలును అభివృద్ధి చేస్తారా.. అనే అంశంపై స్ప‌ష్ట‌త రావాల్సి ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టుగా ప్ర‌ణాళిక‌ల‌న్నీ సిద్ధ‌మైతే.. 2026 మార్చిలో ఉగాది పండ‌గ నాటికి మూసీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలో దుబాయ్ కి చెందిన ఎమ్మార్ ప్రాప‌ర్టీస్ మూసీ సుంద‌రీక‌ర‌ణ ప‌నుల్ని చేప‌ట్టేందుకు ఆస‌క్తి చూపిస్తున్న‌ట్లు స‌మాచారం. కాక‌పోతే, దీనిపై ప్ర‌భుత్వ నిర్ణ‌యం వెలువ‌డాల్సి ఉంది.

* దుబాయ్‌లో బూర్జ్ ఖలీఫాతో పాటు డౌన్‌ టౌన్ ను నిర్మించిన అనుభ‌వం గ‌ల ఎమ్మార్ ప్రాప‌ర్టీస్‌.. మూసీ నది తీరంలో భారీ టౌన్‌ షిప్‌ ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. తెలంగాణ ప్రభుత్వం అనుమతినిస్తే.. హైదరాబాద్ నగర స్కైలైన్‌ ను పూర్తిగా మార్చివేయ‌డానికీ ప్ర‌ణాళిక దోహ‌దం చేస్తుంది. మూసీ నది తీరంలో రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 17 సమీపంలో వందల ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌ షిప్ నిర్మించాలని ఎమ్మార్ ప్రార్టీస్ సంస్థ భావిస్తోంది. ఇందులో రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్‌డ్-యూజ్ డెవలప్‌మెంట్లు వంటివి ఏర్పాటు చేయాల‌నే ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ని స‌మ‌చారాం. ఇటీవల ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసిని ఎమ్మార్ గ్రూప్.. ప్రాథమిక కాన్సెప్టుకు సంబంధించిన డిజైన్ల‌ను ప్ర‌ద‌ర్శించింది. అయితే, ఇది ప్రతిపాదన దశలోనే ఉందని, అధికారిక అనుమతులు రావాల్సి ఉంద‌ని.. దీనిపై త్వ‌ర‌లో స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని స‌మాచారం. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0