నిర్మాణ ప్రదేశాల్లో ఇవి తప్పనిసరి
To curb rising air pollution, Mumbai mandates strict rules for construction sites—measures experts say may impact Hyderabad real estate practices too.
- ముంబైలో వాయు కాలుష్యం నియంత్రణకు మార్గదర్శకాలు జారీ
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం దానిని నివారించేందుకు పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిర్మాణ ప్రదేశాల్లో పాటించాల్సిన అంశాలపై మార్గదర్శకాలు జారీ చేసింది. అవేంటంటే..
- నిర్మాణ భవనాల ఎత్తు 70 మీటర్ల కంటే ఎక్కువ ఉన్న లేదా ఎకరం కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న సైట్ల చుట్టూ 35 అడుగుల ఎత్తులో మెటల్ బారికేడ్లను ఏర్పాటు చేయాలి.
- ఎకరం కంటే తక్కువ ఉన్న నిర్మాణ ప్రదేశాల్లో 25 అడుగుల ఎత్తులో బారికేడ్లను ఏర్పాటు చేయాలి.
- మెట్రో, బ్రిడ్జి, ఫ్లైఓవర్ల నిర్మాణ పనుల్లో 25 అడుగుల ఎత్తున్న బారికేడ్లు పెట్టాలి.
- నిర్మాణంలో ఉన్న భవనాలను తప్పనిసరిగా అన్ని వైపులా ఆకుపచ్చ గుడ్డ, జ్యూట్ షీట్, టార్పాలిన్ తో కవర్ చేయాలి.
- భవనాలను కూల్చివేసేటప్పుడే తప్పకుండా పై నుంచి కింద వరకు కవర్ చేయలి.
- అలాగే కూల్చివేత సమయంలో దుమ్ముధూళి ఎక్కువగా వ్యాపించకుండా నిరంతరాయంగా నీళ్లు స్ప్రే చేయాలి.
- మెటీరియల్ లోడింగ్, అన్ లోడింగ్ సమయాల్లో కచ్చితంగా వాటర్ ఫాగింగ్ చేయాలి.
- ఎర్త్ వర్క్, డెబ్రిస్, లూజ్ సాయిల్ పనులు చేసేటప్పుడు వాటర్ స్ప్రింక్లింగ్ చేయాలి.
- ఆన్ సైట్ లో యాంటీ స్మాగ్ గన్స్ కచ్చితంగా ఉంచాలి.
- కటింగ్, డ్రిల్లింగ్, గ్రైండింగ్, సాయింగ్ పనులను నిరంతరం వాటర్ ఫాగింగ్ మధ్య క్లోజ్ డ్ ఏరియాల్లోనే చేయాలి.
- నిర్మాణ మెటీరియల్స్ తీసుకెళ్లే ప్రతి టక్కూ పూర్తిగా కవర్ చేసి ఉండాలి.
- ట్రక్కులు ఓవర్ లోడింగ్ చేయకూడదు.
- సైట్ ఎగ్జిట్ పాయింట్ వద్ద టైర్ వాషింగ్ వ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి.
- ఎనిమిదేళ్లకు పైబడిన హెవీ డీజిల్ వాహనాలను ముంబై పరిధిలోకి అనుమతించకూడదు.
- నిర్మాణ ప్రదేశాల మొత్తం కవర్ అయ్యేలా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
- ట్రక్కుల టైర్లు శుభ్రంగా ఉన్నాయా లేదా? ఓవర్ లోడ్ తో ఉన్నాయా అనేది సీసీటీవీల్లో చూడాలి.
- సైట్లలో సెన్సర్ ఆధారిత కాలుష్య పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
- నిర్మాణ వ్యర్థాలను బీఎంసీ అధీకృత సీఅండ్ డీ వేస్ట్ డంపింగ్ సైట్లకు మాత్రమే తీసుకెళ్లాలి.
- అన్ని నిర్మాణ ప్రదేశాల్లో వర్కర్లు, సూపర్ వైజర్లు, సైట్ మేనేజర్లు ప్రొటెక్టివ్ మాస్కులు, సేఫ్టీ గాగుల్స్, హెల్మెట్లు ధరించాలి.
- నిర్మాణ వ్యర్థాల అక్రమ డంపింగ్ ను నియంత్రించేందుక నైట్ స్క్వాడ్లను బీఎంసీ ఏర్పాటు చేయనుంది. వ్యర్థాలను ముంబైలో ఎక్కడైనా సరే బహిరంగంగా కాల్చడం నిషిద్ధం.
- లూజ్ సాయిల్, డెబ్రిస్, నిర్మాణ మెటీరియల్స్ ను పూర్తిగా కవర్ చేసి బారికేడ్లు ఏర్పాటు చేయాలి.
- ఆ మెటీరియల్స్ ను రోడ్లు, ఫుట్ పాత్ లు, బహిరంగ ప్రదేశాల్లో ఉంచకూడదు.
- నిర్మాణ ప్రదేశాల వద్ద ఉండే అన్ని ప్రధాన రహదారులను ప్రతి రోజూ వాక్యూమ్ స్వీపర్లు, వాటర్ స్ప్రింక్లింగ్ లేదా బ్రషింగ్ తో శుభ్రం చేయాలి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0