60 రోజుల్లో పరిహారం చెల్లించాలి

MahaRERA introduces strict new rules mandating developers to pay compensation within 60 days. Know how these guidelines impact homebuyers and real estate buyers.

60 రోజుల్లో పరిహారం చెల్లించాలి
maharera-new-guidelines-60-days-compensation-developers-must-pay

-      డెవలపర్లకు మహారెరా మార్గర్శకాలు

కొనుగోలుదారులకు చెల్లించాల్సిన పరిహారం విషయంలో మహారాష్ట్ర రెరా కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చింది. బాంబే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో డెవలపర్ల నుంచి రావాల్సిన పరిహారం త్వరగా వచ్చేలా, బాధిత కొనుగోలుదారులకు ఉపశమనం కలిగేలా వీటిని రూపొందించింది. వివిధ డీఫాల్ట్ లకు సంబంధించి డెవలపర్లు కొనుగోలుదారులకు చెల్లించాల్సిన పరిహారం.. ఉత్తర్వులు ఇచ్చిన నాటి నుంచి 60 రోజుల్లోగా ఇవ్వాలని రెరా తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. "ఇకపై మొదటిసారిగాతగిన అవకాశాలు ఉన్నప్పటికీఏదైనా డెవలపర్ పరిహారం మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే ఆ కేసును తదుపరి చర్యల నిమిత్తం సంబంధిత ప్రాంతంలోని ప్రిన్సిపల్ సివిల్ కోర్టుకు పంపించాల్సి ఉంటుంది. అలాంటి బిల్డర్ లేదా డెవలపర్ కు 3 నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కొత్త నిబంధన పరిహారాన్ని తిరిగి పొందడంలో, గృహ కొనుగోలుదారులకు సకాలంలో ఉపశమనం అందించడంలో ఎంతో సహాయపడుతుంది’’ అని మహా రెరా పేర్కొంది. 

సాధారణంగా కొనుగోలుదారులు గడువులోగా అపార్ట్ మెంట్ ను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైనప్పుడు, నాసిరకం నిర్మాణ నాణ్యత విషయంలో, పార్కింగ్ తదితర సౌకర్యాలు లేకపోవడం వంటి సమస్యలపై డెవలపర్ తో సామరస్యపూర్వక పరిష్కారం లభించకపోతే రెరాను ఆశ్రయిస్తారు. వీటిని రెరా అధికారులు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలో కొత్త మార్గదర్శకాల ప్రకారం 60 రోజుల్లోగా డెవలపర్లు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆ మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలి. అప్పటికీ చేయని పక్షంలో డెవలపర్ ఆస్తులు, బ్యాంకు ఖాతాలు స్వాధీనం చేసుకోవడానికి కలెక్టర్ కు రికవరీ వారెంట్ పంపిస్తారు. ఇక్కడ కూడా డెవలపర్ తన వివరాలను అందించకపోతే ఆ కేసులోని ఆ ప్రాంతంలోని ప్రధాన సివిల్ కోర్టుకు పంపిస్తారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0