సౌదీలోనూ స్తిరాస్థి సొంతం చేసుకోవచ్చు

Saudi Arabia to allow foreigners to buy real estate from January. New zones, ownership rules and Vision 2030 reforms to boost global property investment.

Nov 30, 2025 - 23:46
 0  71
సౌదీలోనూ స్తిరాస్థి సొంతం చేసుకోవచ్చు
saudi-arabia-opens-real-estate-market-to-foreigners-from-january-2025

-      జనవరిలో సౌదీ రియల్ మార్కెట్ ప్రారంభం

ఇకపై సౌదీ అరేబియాలో కూడా విదేశీయులు స్తిరాస్థులు కొనుగోలు చేయవచ్చు. తమ దేశంలో విదేశీయులు ప్రాపర్టీలు కొనుగోలు చేసేందుకు వీలుగా తీసుకొచ్చిన సంస్కరణలు త్వరలోనే అమలు చేయనున్నట్టు సౌదీ తెలిపింది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఇవి అమల్లోకి వస్తాయని.. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టినట్టు పేర్కొంది. సౌదీయేతరులు అభివృద్ధి చేయడానికి భూమిని సేకరించడంతో పాటు నివాసవాణిజ్యవ్యవసాయ, పారిశ్రామిక ఆస్తులను కొనుగోలు చేయొచ్చని రియల్ ఎస్టేట్ జనరల్ అథారిటీలోని ఒక సీనియర్ అధికారి తెలిపారు. రియాద్జెద్దాలతోపాటు పవిత్ర నగరాలైన మక్కా, మదీనాలలో విదేశీయుల కోసం ఏర్పాటు చేసిన జోన్లు ప్రస్తుతం సమీక్షలో ఉన్నాయి. వాటిని ఖరారు చేయడంతోపాటు కొత్త రియల్ ఎస్టేట్ యాజమాన్య నియమ నిబంధనలను త్వరలోనే వెల్లడిస్తామని సంబంధిత అధికా వర్గాలు వెల్లడించాయి. ఆ జోన్లు చాలా విస్తృతంగా ఉంటాయని.. మెగా ప్రాజెక్టులను చేపట్టే విధంగా వాటిని తీర్చిదిద్దుతామని పేర్కొన్నాయి. ఆ ప్రాంతాలలో సౌదీయేతర యాజమాన్యం యొక్క నిష్పత్తిని 70%-90% వరకు పరిమితం చేయాలని భావిస్తున్నట్టు తెలిపాయి. 

 

ఇక రెండు పవిత్ర నగరాలైన మక్కా, మదీనాల్లో కొనుగోలు చేసే వ్యక్తులు ముస్లింలే అయి ఉండాలని, అంతకుమించి పెద్దగా పరిమితులు ఉండబోవని చెప్పాయి. విదేశీయుల రియల్ యాజమాన్యానికి సంబంధించిన నియమ నిబంధనలు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయని.. వాటిని ప్రభుత్వం ఆమోదించిన తర్వాత వెల్లడిస్తామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి, విజన్ 2030 వైవిధ్యీకరణ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి సౌదీ అరేబియా జూలైలో తన ఆస్తి యాజమాన్య చట్టాన్ని సవరించడానికి ఆమోదం తెలిపింది. దీంతో అక్కడ విదేశీయులు ప్రాపర్టీలు కొనుగోలు చేయడానికి అవకాశం కలిగింది. ఈ నేపథ్యంలో అక్కడ కొనుగోళ్లను సులభతరం చేయడానికి ఓ పోర్టల్ కూడా ప్రారంభించారు. విదేశీయుల కోసం ఏర్పాటు చేసిన జోన్లు, నియమ నిబంధనలు ఖరారైన తర్వాత వాటిని ఆ పోర్టల్ లో పొందుపరుస్తారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0