బెంగళూరు హైవే పై.. ఆరాంఘర్ వద్ద భారీ స్కైవాక్
A new skywalk at Aramghar junction on Bengaluru highway aims to ease traffic and improve pedestrian safety, boosting connectivity and Hyderabad real estate value.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతోంది. బెంగళూరు రహదారిపై ఆరాంఘర్ చౌరస్తాలో భారీ స్కై వాక్‌ను నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. పాదచారుల భద్రత, వాహనాల రాకపోకల కోసం వలయాకార స్కైవాక్ నిర్మించాలని జీహెచ్ఎంసీ ప్రతిపాదించింది. శంషాబాద్ ఎయిప్ పోర్టుకు వెళ్లే మార్గంలో రూపుదిద్దుకోనున్న ఈ స్కై వాక్ పూర్తయ్యాక.. పాదచారులు రోడ్డు దాటడానికి ఇబ్బందులు పడక్కర్లేదు. వృద్ధులు, దివ్యాంగులు స్కై వాక్ ను ఉపయోగించుకునేలా లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాట్లు చేస్తారని సమాచారం.
ఆరాంఘర్ జంక్షన్ స్థానిక రద్దీకే పరిమితం కాకుండా.. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన మార్గంగా ఉంది. శంషాబాద్, కర్నూలు, బెంగళూరు వైపు నుంచి వచ్చే వాహనాలు.. చాంద్రాయణగుట్ట, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, మెహదీపట్నం వైపు వెళ్లే వాహనాలతో ఈ భారీ కూడలి నిత్యం రద్దీగా ఉంటోంది. ఈ మధ్యకాలంలో ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు 4.4 కిలోమీటర్ల మేర ఆరు వరుసల ఫ్లైఓవర్ ప్రారంభమైనప్పటికీ.. గ్రౌండ్ లెవల్‌లో పాదచారులు రోడ్డు దాటడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఇక్కడ రూ. 30 కోట్లతో కొత్త స్కైవాక్ నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. కూకట్‌పల్లి జేఎన్టీయూ ప్రాంతంలోనూ కొత్త స్కై వాక్ నిర్మాణానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని సమాచారం.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0