హైద‌రాబాద్ రియాల్టీలో మిడ్ సెగ్మంటే.. ఎప్ప‌టికైనా బెట‌ర్‌!

“V. Krishna Reddy of Sri Srinivasa Infra Explains Why Mid-Segment Housing Never Fails”

Jan 9, 2026 - 10:58
Jan 13, 2026 - 05:25
 0  52
హైద‌రాబాద్ రియాల్టీలో మిడ్ సెగ్మంటే.. ఎప్ప‌టికైనా బెట‌ర్‌!

శ్రీ శ్రీనివాసా ఇన్‌ఫ్రా మేనేజింగ్ పార్ట్‌న‌ర్ వి.కృష్ణారెడ్డి స్పెష‌ల్ ఇంట‌ర్వ్యూ.. 

2025లో హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ గురించి కొంద‌రు బిల్డ‌ర్లు మంద‌కోడిగా ఉంద‌ని చెప్ప‌డం విన్నాను. కాక‌పోతే, కోకాపేట్‌లో మా మార్కైస్‌, ఫార్చ్యూన్ సూర‌జ్ భాన్ గ్రాండే ప్రాజెక్టుల‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. రెండేళ్ల క్రితం ఆరంభ‌మైన మార్కైస్ ప్రాజెక్టులో 70 శాతం ఫ్లాట్ల‌ను విక్ర‌యించ‌గ‌లిగాం. ఇందులో 5000, 6000, 9900 చ‌ద‌ర‌పు అడుగుల ఫ్లాట్ల‌ను డిజైన్ చేశాం. ఇటీవ‌లే ఆరంభించిన ఫార్చ్యూన్ గ్రాండే కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. దాదాపు 35 శాతం ఫ్లాట్ల‌ను ఈ ప్రాజెక్టును ప్రారంభించిన మూడు నెలల్లో విక్ర‌యించ‌గ‌లిగాం. ఇందుకు దోహ‌ద‌ప‌డే అంశాల్ని క్షుణ్నంగా అధ్య‌య‌నం చేస్తే.. లొకేష‌న్‌కు ప్ర‌థ‌మ ప్రాధాన్య‌త ల‌భించింది. ఆత‌ర్వాత ప్రాజెక్టు ప్ర‌ణాళిక‌, అందులో పొందుప‌రిచే స‌దుపాయాలు వంటివి బ‌య్య‌ర్ల‌ను అమితంగా ఆక‌ర్షించాయి. పైగా, నియోపోలిస్ చుట్టుప‌క్క‌ల ప్రాజెక్టుల్లో చ‌ద‌ర‌పు అడుక్కీ 11,500++ నుంచి 12,000++ మ‌ధ్య‌లో చాలామంది విక్ర‌యిస్తున్నారు. త‌మ ప్రాజెక్టును నియోపోలిస్‌కు అతి చేరువ‌లో ఉన్న‌ప్ప‌టికీ.. తాము మాత్రం చ‌ద‌ర‌పు అడుక్కీ రూ.10,500++కు ఇస్తున్నాం. అందుకే, మా ప్రాజెక్టుకు అద్భుత‌మైన స్పంద‌న ల‌భించింది. కూక‌ట్‌ప‌ల్లి ప‌రిస‌ర ప్రాంతాల్లో అధిక ఇన్వెంట‌రీ ఉన్న‌ప్ప‌టికీ.. 2025 ఏప్రిల్లో ఆరంభించిన ఫార్చ్యూన్ వాట‌ర్ ఫ్రంట్ ప్రాజెక్టులో 30 శాతం అమ్మ‌కాలు జ‌రిగాయి. 

* 2025లో హైద‌రాబాద్ రియాల్టీ మార్కెట్‌ను క్షుణ్నంగా గ‌మ‌నిస్తే.. లార్జ్ ఫార్మాట్ ఫ్లాట్ల అమ్మ‌కాలు కాస్త నెమ్మ‌దించాయి. ప్ర‌ధానంగా ఆరు వేల నుంచి ప‌దివేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణం గ‌ల ఫ్లాట్ల‌ను కేవ‌లం కొద్దిమంది మాత్ర‌మే కొనుక్కోగ‌ల్గుతారు. అందుకే, 2000 నుంచి మూడు వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో డిజైన్ చేసే మిడ్ సెగ్మంట్ ఎప్ప‌టికైనా సేఫ్ బెట్ అని చెప్పొచ్చు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని.. కోకాపేట్‌లోని త‌మ కొత్త ప్రాజెక్టు ఫార్చ్యూన్ గ్రాండేను 2909 నుంచి 3910 చ‌ద‌ర‌పు అడుగుల్లోపే డిజైన్ చేశాం. రెరా నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఐదేళ్ల‌లోపు ఫార్చ్యూన్ గ్రాండే ప్రాజెక్టును బ‌య్య‌ర్ల‌కు హ్యాండోవ‌ర్ చేసేందుకు ప్ర‌ణాళిక‌ల్ని రచిస్తున్నాం. 

ఇన్వెస్ట్‌మెంట్స్ కోసం..
సీఎం అహ‌ర్నిశ‌లు కృషి
భార‌త్ ఫ్యూచ‌ర్ స‌మ్మిట్ వ‌ల్ల మార్కెట్లో కాస్త క‌ద‌లిక‌లైతే ఏర్ప‌డ్డాయి. మార్కెట్లో సానుకూల‌త ఏర్ప‌డింది. అయితే, అంత‌కంటే ముందు క్రెడాయ్ హైద‌రాబాద్ ప్రాప‌ర్టీ షోకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. రియ‌ల్ ఎస్టేట్ రంగంలో స‌రికొత్త ఉత్సాహాన్ని నింపారు. ఆ త‌ర్వాత జ‌రిగిన భార‌త్ ఫ్యూచ‌ర్ స‌మ్మిట్‌లో ఐదు ల‌క్ష‌ల కంటే అధిక పెట్టుబ‌డుల్ని ఆక‌ర్షించ‌డంతో.. ఇన్వెస్ట‌ర్ల‌లో కూడా విశ్వాసం నెల‌కొంది. ఒక‌వైపు రాష్ట్ర ముఖ్య‌మంత్రి, మ‌రోవైపు ఐటీ మంత్రి శ్రీధ‌ర్ బాబులు క‌లిసి దావోస్ స‌ద‌స్సుకు హాజ‌రు కావ‌డం.. అక్క‌డ ఇన్వెస్ట్‌మెంట్ల‌ను ఆక‌ర్షించ‌డం.. వివిధ దేశాల‌కు చెందిన బ‌హుళ‌జాతి సంస్థ‌ల‌ను తెలంగాణ‌కు ర‌ప్పించ‌డంలో విజ‌యం సాధించారు. న‌గ‌రానికి జీసీసీలు ఎక్కువ‌గా రావ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం తీసుకున్న విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాలేన‌ని చెప్పొచ్చు. కొత్త‌గా వచ్చే కంపెనీల వ‌ల్ల నిర్మాణ రంగానికి ఎక్క‌డ్లేని ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.

* సాధార‌ణంగా వేలంలో స్థ‌లాల్ని విక్ర‌యించిన‌ప్పుడు.. మార్కెట్లో ఒక హైప్ క్రియేట్ అవుతుంది. ఈ అంశాన్ని మ‌నం కొన్నేళ్ల నుంచి చూస్తూనే ఉన్నాం. అలా ప్లాట్ల‌ను అమ్మితే.. ప్ర‌భుత్వానికి కొంత రెవెన్యూ వ‌స్తుంది. ఈ ఆక్ష‌న్‌లో ఎక‌రానికి సుమారు 140 కోట్లను ప‌రిశీలిస్తే.. బేసిక్ సేల్ ప్రైస్  చ‌ద‌ర‌పు అడుక్కీ 14,000 ఉంటేనే లాభ‌ముంటుంది. కానీ, ప్ర‌స్తుతం నియోపోలిస్‌లో ప్ర‌ముఖ బిల్డ‌ర్లంతా కూడా చ‌ద‌ర‌పు అడుక్కీ 11,500++ నుంచి 12,000++ కు అమ్ముతున్నారు.

2026 ఎలా ఉంటుంది? 
2026లో ఇళ్ల అమ్మ‌కాలు పెర‌గ‌డానికి పూర్తి ఆస్కార‌ముంది. కొత్త‌గా ప్రాజెక్టుల‌ను చేప‌ట్టే బిల్డ‌ర్ ఎవ‌రైనా ఆర్థికంగా ఓవ‌ర్ స్ట్రెచ్ కాకుండా చూసుకోవాలి. ప్రాజెక్టును ప్రారంభించే ముందు.. ఓ ఇర‌వై, ఇర‌వై ఐదు శాతం న‌గ‌దును చేతిలో పెట్టుకుని నిర్మాణాల్ని ప్రారంభించాలి. ఆ త‌ర్వాతే బ్యాంక్ లోన్స్‌, సేల్స్ వంటివి ప్రాజెక్టును ముందుకు తీసుకుని వెళ్ల‌గ‌ల‌వు. ఎక్క‌డ ప్రాజెక్టును ప్రారంభించినా ముందుస్తుగా అక్క‌డి చుట్టుప‌క్క‌ల మార్కెట్‌ను కొంత అసెస్ చేసి రంగంలోకి దిగాలి.

* కొత్త ఏడాదిలో రాష్ట్ర ప్ర‌భుత్వం మౌలిక స‌దుపాయాల్ని మెరుగుప‌ర్చాలి. ముఖ్యంగా అభివృద్ధికి ఆస్కామున్న ప్రాంతాల్లో కాస్త ఎక్కువ ఫోక‌స్ పెట్టాలి. ర‌హ‌దారులు, తాగునీటి స‌ర‌ఫ‌రా, డ్రైనేజీ, వ‌ర‌ద నీటి కాల్వ‌లు, విద్యుత్తు వంటివి అభివృద్ధి చేయాలి. లేక‌పోతే ఏమ‌వుతుందంటే.. మౌలిక అభివృద్ధి కంటే ముందే.. ఆయా ప్రాజెక్టుల్లో అపార్టుమెంట్లు వ‌చ్చేస్తే.. అందులో కొనుక్కున్న‌వారు తీవ్ర ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. ముందుగా ఇన్‌ఫ్రా డెవ‌ల‌ప్ అయితేనే.. బిల్డ‌ర్లు కొత్త ప్రాజెక్టుల‌ను లాంచ్ చేయ‌డానికి ఆస్కార‌ముంటుంది. కొత్త ప్రాంతాలు డెవ‌ల‌ప్ అయ్యేందుకు అవ‌కాశం ఉంటుంది. ప్ర‌భుత్వానికీ ఫీజులు, ఛార్జీల రూపంలో ఖ‌జానా నిండుతుంది. 

* ప్ర‌స్తుతం సుమారు తొంభై ల‌క్ష‌ల చ‌దర‌పు అడుగుల స్థ‌లాన్ని అభివృద్ధి చేస్తున్నాం. వ‌చ్చే ఒక‌ట్రెండేళ్ల‌లో మూడు ప్రాజెక్టులైన‌ మార్కైస్‌, వాట‌ర్ ఫ్రంట్‌, మోకిలాలో సోమ్ బోలెవార్డ్ విల్లా ప్రాజెక్టును పూర్తి చేయాల‌న్న ల‌క్ష్యంతో ముందుకెళుతున్నాం. కొత్త సంవ‌త్స‌రంలో కొన్ని ప్రాజెక్టుల్ని మొద‌లెట్టాల‌న్న ఆలోచ‌న‌లున్నాయి. 

కోకాపేట్లో కొత్త ప్రాజెక్టు..
ఫార్చ్యూన్ గ్రాండే.. 
అపార్టుమెంట్ల‌ను అంద‌రూ క‌డ‌తారు. కానీ, మేం నియోపోలిస్లో డిజైన్ చేసిన ఫార్చ్యూన్ సూర‌జ్ భాన్ గ్రాండే ప్రాజెక్టును ఎవ‌రైనా గ‌మ‌నిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు. ఎందుకంటే క‌ళాత్మ‌క‌త‌, ఆర్కిటెక్చ‌ర్‌ను క‌ల‌బోసి రూపుదిద్దుకునేలా ఫార్చ్యూన్ గ్రాండే ప్రాజెక్టును డిజైన్ చేశాం. టీజీ రెరా అనుమ‌తి గ‌ల ఈ ప్రాజెక్టు విస్తీర్ణం ప‌న్నెండు ఎక‌రాలైన‌ప్ప‌టికీ.. సెంట్ర‌ల్ పార్కు కోసం ఏడున్న‌ర ఎక‌రాల్ని వ‌దిలిపెట్టాం. 45 అంత‌స్తుల ప్రాజెక్టులో వ‌చ్చేవ‌న్నీ అల్ట్రా ల‌గ్జ‌రీ ఫ్లాట్లే. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. గ్రౌండ్ లెవెల్ నుంచి 75 అడుగుల ఎత్తులో రెసిడెన్షియ‌ల్ ఫ్లాట్లు ప్రారంభ‌మ‌వుతాయి. ఈ ప్రాజెక్ట‌ను చూస్తే గ‌న‌క హ్యాంగింగ్ అపార్టుమెంట్ల త‌ర‌హాలో ద‌ర్శ‌న‌మిస్తుంది. ప్ర‌తి అపార్టుమెంట్‌కు ప్రైవేటు లాబీ ఉంటుంది. సీలింగ్ హైటే 11 అడుగులు పెట్టాం. ప్ర‌తి ఫ్లోరులో వ‌చ్చేవి ఐదంటే ఐదే ఫ్లాట్లే. ప్ర‌తి ఫ్లాటులోకి ధారాళ‌మైన గాలీ, వెలుతురు వ‌చ్చేలా డిజైన్ చేశాం. 

* ల‌క్ష చ‌ద‌ర‌పు అడుగుల్లో డెవ‌ల‌ప్ చేస్తున్న క్ల‌బ్‌హౌజ్.. రెండున్న‌ర ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల్లో స్టిల్ట్ లెవెల్ ఎమినిటీస్.. ఫార్చ్యూన్ సూర‌జ్ భాన్ గ్రాండే ప్రాజెక్టుకే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. రిలాక్స్ అవ్వ‌డంతో పాటు రిక్రియేష‌న్‌కు ఈ క్ల‌బ్ హౌజ్ ప్ర‌తిఒక్క‌రికీ న‌చ్చుతుంది. అంతేకాదు, పార్టీలు చేసుకోవ‌డంతో పాటు ఫిట్‌నెస్ ప్రియుల‌కు ఇంత‌కుమించిన బెస్ట్ ప్లేస్ లేద‌నే చెప్పాలి. ఇందులో ఫ్లాట్ల‌ను కొనుగోలు చేసేవారికీ ఎలాంటి ఆటంకాల్లేని వ్యూస్ ఉంటాయ‌ని చెప్పొచ్చు. అన్నివైపులా ఓపెన్ ల్యాండ్స్ ఉండ‌ట‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0