బంగారం - రియల్ ఎస్టేట్.. ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్
Is gold still the safest investment? Experts compare gold vs real estate and explain why Hyderabad real estate offers better long-term returns.
బంగారం.. స్టాక్ మార్కెట్.. రియల్ ఎస్టేట్.. పెట్టుబడికి ఏది బెటర్? ప్రస్తుతం ఎక్కువ మంది ఏ రంగంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు? భారత్‌లో మెజార్టీ వర్గం సురక్షితమైన పెట్టుబడిగా ఏ రంగాన్ని భావిస్తోంది? ఈ ప్రశ్నలన్నింటికి ఒకే సమాధానం రియల్ ఎస్టేట్. అవును బంగారం, షేర్ మార్కెట్ల కంటే ఇళ్లు, ప్లాట్ల కొనుగోలు ద్వారానే అధిక రాబడి వస్తుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అందుకు అనుగుణంగానే బంగారం కంటే రియల్ ఎస్టేట్ రంగంలోనే రాబడి ఎక్కువగా ఉంటుందని ఆర్ధికరంగ నిపుణులు చెబుతున్నారు.
మనం సంపాదించే ప్రతి రూపాయినీ ఎంతో అపురూపంగా చూసుకుంటాం. ప్రతి ఒక్కరు తమ సంపాదనలో ఖర్చులు పోను మిగిలిన సొమ్మును ఏదో ఒక రంగంలో పెట్టుబడిగా పెట్టాలనుకుంటారు. పిల్లల భవిష్యత్తు కోసం ఆస్తులను కూడబెట్టాలని కోరుకుంటారు. మరి కష్టపడి సంపాదించిన డబ్బులను ఏ రంగంలో ఇన్వెస్ట్ చేస్తే సురక్షితంగా ఉంటుంది.. ఏ రంగంలో ఎక్కువ రాబడి ఉంటుంది అనేవి చాలా మందిలో మెదిలే ప్రశ్నలు. నిన్నటి వరకు మెజార్టీ జనం తాము కూడబెట్టుకున్న డబ్బులతో బంగారం కొనుక్కునేవారు. బంగారమైతే తమ దగ్గరే ఉంటుందన్న భరోసాతో పాటు, అత్యవసర సమయంలో ఆర్థిక అవసరాలకు ఉపయోగపడుతుందని చాలా మంది అభిప్రాయపడేవారు. ఆ తరువాత ఎక్కువ మంది పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తూ వస్తున్న మరో రంగం స్టాక్ మార్కెట్. షేర్ మార్కెట్ లో కొంతమేర నష్టభయం ఉన్నా, అధిక లాభాలు వస్తాయన్న ఆలోచనతో చాలా మంది ఇన్వెస్ట్ చేస్తారు.
భారతీయ సంప్రదాయంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులోను ఆడవాళ్లకు బంగారమంటే ఎంతో మక్కువ. బంగారాన్ని అలంకరించుకోవడం సంస్కృతిలో ఓ భాగమని అనుకుంటారు. అంతేకాదు బంగారాన్ని ఓ రకమైన ఆస్తిగా కూడా పరిగణిస్తారు. అందుకే చాలా మంది మహిళలు కేవలం అలంకరించుకోవడానికి మాత్రమే కాకుండా డబ్బులను బంగారంపై పెట్టుబడిగా పెడుతుంటారు. చాలా మంది షేర్ మార్కెట్లతో పాటు బంగారంపై ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు అందరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. డబ్బులుంటే చాలు బంగారం కొనాలనుకునే చాలా మంది దృక్పథం మారింది. దాచుకున్న, పొదుపు చేసుకున్న డబ్బులను బంగారం కంటే ఎక్కువ రాబడి ఇచ్చే రంగంపై పెట్టుబడిగా పెడుతున్నారు. ప్రస్తుతం బంగారం ధర ఆకాశాన్నంటుతుండటం ఇందుకు మరో కారణంగా చెప్పుకోవచ్చు.
ప్రస్తుత పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్, బంగారం ఈ రెండింటిలో ఏది ఎంపిక చేసుకోవాలన్నది భారతీయ సంప్రదాయ పెట్టుబడిదారులకు పెద్ద ప్రశ్నగా మారుతోంది. ఎవరైనా ఎక్కువ రిటర్న్స్ ఎక్కడ వస్తాయో అక్కడ పెట్టుబడి పెట్టాలనుకుంటారు. ఇటీవల బంగారం ధర విపరీతంగా పెరుగుతోంది. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ కాస్త మందకొడిగా కొనసాగుతూ వస్తుండగా.. ఇప్పుడు క్రమంగా పుంజుకుంటోంది. ఏరంగంలోనైనా పెద్దగా బూమ్ లేనప్పుడు పెట్టుబడి పెడితే.. బూమ్ వచ్చినప్పుడు లాభాల పంట పండుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఇప్పుడు చాలమంది బంగారమా.. రియల్ ఎస్టేట్ రంగమా అని ఆలోచిస్తున్నారు.
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ వెల్త్ కన్వర్సేషన్స్ రిపోర్ట్ ప్రకారం.. గత 20 సంవత్సరాల క్రితం 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్‌మెంట్ బంగారంలో పెడితే ఇప్పుడు అది రూ.15.5 లక్షలు అయ్యింది. అంటే 15 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చినట్లు. అదే లక్ష రూపాయలు 20 ఏళ్ల క్రితం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెడితే ప్రాంతాన్ని బట్టి 24 నుంచి 32 లక్షలు అయ్యిందని నివేదిక చెబుతోంది. అంటే సుమారుగా 28 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చినట్లు. ఇక రియల్ ఎస్టేట్‌లో రెంటల్ ఆదాయం పరిగణనలోకి తీసుకుంటే మరికొంత పెరుగుతుంది. ఈ డేటా ఆధారంగా, దీర్ఘకాలంలో రియల్ ఎస్టేట్ స్థిరత్వం, డ్యూయల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో మెరుగ్గా నిలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గత 10 నుంచి 15 సంవత్సరాల డేటా చూస్తే బంగారం షార్ట్ టర్మ్ ర్యాలీలలో ముందంజలో ఉంటూ వస్తోంది. కానీ దీర్ఘకాలంలో రియల్ ఎస్టేట్ బెటర్ ఆప్షన్ అని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ఇన్వెస్ట్‌మెంట్ సులభమైన ప్రక్రియ. నేరుగా బంగారం కొనుగోలు చేయడంతో పాటు సావరిన్ గోల్డ్ బాండ్స్ , ఈటీఎఫ్ లు, డిజిటల్ గోల్డ్ ద్వారా తక్షణం కొనుగోలు లేదంటే విక్రయం సాధ్యమవుతాయి. కానీ రియల్ ఎస్టేట్ రంగంలో స్థిరాస్తుల కొనుగోలుతో పాటు అమ్మకానికి మార్కెట్ కు అనుగుణంగా కొంత ఎదురుచూడాల్సి వస్తుందన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0