ఫిర్యాదుల పరిష్కారంలో మహా రెరా సూపర్
“MahaRERA Sets a Benchmark in Complaint Resolution”
- 81 శాతానికి పెరిగిన పరిష్కార రేటు
ఫిర్యాదుల పరిష్కారంలో మహారాష్ట్ర రెరా అదరగొడుతోంది. 2025లో మహా రెరా ఏకంగా 81 శాతం ఫిర్యాదులను పరిష్కరించింది. 2025లో గృహ కొనుగోలుదారుల నుంచి వచ్చిన 6,945 ఫిర్యాదులను పరిష్కరించినట్లు వెల్లడించింది. ఇది 2024లో పరిష్కరించిన 3,824 ఫిర్యాదుల కంటే ఎక్కువ అని పేర్కొంది. 2024తో పోలిస్తే 2025లో ఫిర్యాదుల పరిష్కారంలో 81% పెరుగుదల ఉన్నట్లు వివరించింది. "2025 క్యాలెండర్ సంవత్సరంలో మొత్తం 5,039 ఫిర్యాదులు దాఖలయ్యాయి. ఈ కాలంలో 6,945 ఫిర్యాదులపై ఉత్తర్వులు జారీ చేశారు. తద్వారా గృహ కొనుగోలుదారులకు గణనీయమైన ఉపశమనం కల్పించారు. అంతకు ముందు సంవత్సరాలలో, ప్రత్యేకంగా 2024లో మొత్తం 3,824 కేసులు పరిష్కారమయ్యాయి. 2023లో ఇది 2,784గా ఉంది. 2024లో దాఖలైన ఫిర్యాదుల సంఖ్య 3,880 కాగా, 2023లో 4,000గా ఉంది" అని మహా రెరా ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం 6,916 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, నవంబర్ 2025 వరకు నమోదైన ఫిర్యాదులకు మొదటి విచారణ జరగడంల లేదా విచారణ షెడ్యూల్ ఖరారైందని పేర్కొంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0