నెలకు రూ.14.5 లక్షల అద్దె

Dec 17, 2025 - 12:06
 0  66
నెలకు రూ.14.5 లక్షల అద్దె
14.5-laks-rent-per-month

-      ముంబైలో కమర్షియల్ స్పేస్ లీజుకిచ్చిన హృతిక్ పేరెంట్స్

ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ తల్లిదండ్రులు రాకేష్ రోషన్, ప్రమీలా రోషన్ తమ కమర్షియల్ స్పేస్ ను లీజుకు ఇచ్చారు. అంధేరి వెస్ట్ వీరదేశాయ్ రోడ్డులోని డి మాల్ లో ఉన్న 6,389 చదరపు అడుగుల స్థలాన్ని ఐదు సంవత్సరాల పాటు నెలకు రూ.14.5 లక్షలకు అద్దెకు ఇచ్చారు. ఫ్యాబిండియా లిమిటెడ్ ఈ స్థలాన్ని అద్దెకు తీసుకుంది. చదరపు అడుగుకు అద్దె రూ.227గా అయింది. ఈనెల 9న దీనికి సంబంధించిన ఒప్పందం నమోదు కాగా, సెక్యూరిటీ డిపాజిట్ గా ఫాబిండియా రూ.87 లక్షలు చెల్లించింది. లీజులో భాగంగా ఈ సంస్థకు ఐదు కార్ పార్కింగ్ స్లాట్ లు కూడా వచ్చాయి. ఒప్పందం ప్రకారం 2025 సెప్టెంబర్ ఒకటి నుంచి ఐదేళ్లపాటు లీజు అమల్లో ఉంటుంది. అలాగే లాక్ ఇన్ వ్యవధిని 15నెలలుగా పేర్కొన్నారు. మొదటి సంవత్సరానికి నెలవారీ అద్దె రూ.14.5 లక్షలుగా ఉండగా.. రెండో ఏడాది రూ. 15 లక్షలకు, మూడవ సంవత్సరంలోరూ.16 లక్షలకు పెరుగుతుంది. నాలుగు, ఐదు సంవత్సరాల్లో ఇది రూ.18.4 లక్షలుగా ఉంటుంది. ‘ఈ లావాదేవీ వాణిజ్య రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై సెలబ్రిటీలలో పెరుగుతున్న ఆసక్తికి స్పష్టమైన సూచన. స్థిరమైన రాబడిని, దీర్ఘకాలిక విలువ పెరుగుదలను అందించగల సామర్థ్యం కమర్షియల్ రియల్ ఎస్టేట్ కు ఎక్కువగా ఉందని సెలబ్రిటీలు గుర్తిస్తున్నారు‘ అని సీఆర్ఈ మ్యాట్రిక్స్ సీఈఓ అభిషేక్ కిరణ్ గుప్తా అన్నారు. కాగా, ఇటీవల రాకేష్ రోషన్ దంపతులు అంధేరి ప్రాంతంలో రూ. 19.68 కోట్లకు ఐదు వాణిజ్య కార్యాలయ యూనిట్లను కొనుగోలు చేశారు. వైద్య స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వైద్య వెస్ట్ వరల్డ్ వన్ ఏరోపోలిస్ అనే భవనంలో మొత్తం ఐదు కార్యాలయ యూనిట్లను వారిద్దరూ కొన్నారు.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0