వైజాగ్ - రాయ్ పూర్ ఆరు గంట‌ల్లో..

Vizag to Raipur travel time will drop to 6 hours with new greenfield expressway under Bharatmala, reducing distance and boosting development across three states.

Dec 26, 2025 - 21:51
 0  126
వైజాగ్ - రాయ్ పూర్   ఆరు గంట‌ల్లో..
Vizag-to-Raipur-travel-time-will-drop-to-6-hours-with-new-greenfield-expressway

-      కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వేతో 7-8 గంటలు తగ్గనున్న ప్రయాణ సమయం

-      రూ.20వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కేంద్ర ప్రభుత్వం

-      వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కానున్న రహదారి

ఏపీలోని వైజాగ్ నుంచి ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ కు ఆరు గంటల్లోపే వెళ్లిపోవచ్చు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ లను కలిపే ఆరు వరసల గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం వేగంగా జరుగుతోంది. భారతమాల పరియోజన కింద కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.20వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపట్టింది. 

గతంతో వైజాగ్ నుంచి రాయ్ పూర్ కు 13 నుంచి 14 గంటల సమయం పట్టేది. ఇప్పుడు ఆ సమయం దాదాపు 7-8 గంటలకు పైగా తగ్గనుంది. గతంలో ఈ రెండు నగరాల మధ్య దూరం 590 కిలోమీటర్లు ఉండగా.. కొత్త రహదారితో అది 464 కిలోమీటర్లకు తగ్గనుంది. కొండల మధ్య సొరంగాలుచెరువు చుట్టూ వృత్తాకార రహదారి వంటి పలు ప్రత్యేకతలు ఈ రహదారిలో ఉన్నాయి. కేంద్ర రోడ్డు రవాణారహదారుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ఆరు వరుసల రహదారిని వచ్చే ఏడాది డిసెంబరు నాటికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీలో ఈ హైవే 100 కిలోమీటర్ల మేర ఉండనుంది. అనకాపల్లి జిల్లా సబ్బవరం దగ్గర కోల్‌కతా-చెన్నై హైవే దగ్గర నుంచి విజయనగరంపార్వతీపురం మన్యం జిల్లాల మీదుగా వెళ్లి.. పాచిపెంట మండలం బంగారుగుడి తర్వాత ఒడిశాలోకి ప్రవేశిస్తుంది. ఒడిశాలో 240 కిలోమీటర్లు, ఛత్తీస్ గఢ్ లో 124 కిలోమీటర్ల మేర ఈ రహదారి ఉంటుంది. మూడు రాష్ట్రాలలోని మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో దీనిని చేపట్టారు. ఈ కారిడార్‌ కొండలుఅడవుల మధ్యలో ఎన్నో వంపులతో సాగుతుంది. 

* ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాలోకి ప్రవేశించగానే కొండల మధ్యలో రెండు సొరంగాలు నిర్మించాల్సిన అవసరం ఏర్పడింది. ఒక్కో సొరంగం 3.4 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ సొరంగాల నిర్మాణం ఒక ఇంజినీరింగ్ అద్భుతంగా చెప్పవచ్చు. వీటిని కొరాపుట్ జిల్లాలోని సుంకి ఘాట్‌కు సమీపంలో నిర్మించారు. అలాగే రహదారికి ఇరువైపులా దాదాపు 30వేల చెట్లు నాటారు. జంతువులు రోడ్డు దాటడానికి వీలుగా పలుచోట్ల అండర్ పాస్ లు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మార్గంలో పలు టూరిస్ట్ స్పాట్ లు కూడా ఉన్నాయి. అరకు వ్యాలీ సీనరీతోపాటు వైల్డ్ లైఫ్ శాంక్చరీలు, నేషనల్ పార్కులు చూడొచ్చు. ఒడిశాలో అంబపాని వైల్డ్ లైఫ్ శాంక్చరీ, ఛత్తీస్ గఢ్ లో సీతానది వైల్డ్ లైఫ్ శాంక్చరీ, కుటుమ్ సార్ కేవ్, దండక్ గుఫ, బైంసా దర్హా, ఇంద్రావతి నేషనల్ పార్క్, భైరాంఘర్ వైల్డ్ లైఫ్ శాంక్చరీ ఈ రహదారికి సమీపంలో ఉన్నాయి.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0