మూడు వేల కోట్ల.. ప్రీలాంచ్ మోసాలు!
Hyderabad real estate buyers face rising pre-launch scams in 2025, with illegal builders cheating home buyers of nearly ₹3,000 crore.
కొన్నేళ్లు ఉద్యోగం చేసి.. పైసా పైసా కూడబెట్టుకొని.. డబ్బు చాలకపోతే.. అప్పు చేసి మరీ సొంతిల్లు కొనుక్కోవడానికి చాలామంది ఆశపడతారు. మార్కెట్ రేటు కంటే తక్కువకు దొరికితే చాలు.. ఉన్న సొమ్మంతా ఊడ్చేసి మరి బిల్డర్ల చేతిలో పోస్తుంటారు. అయితే, ఇలాంటి మధ్యతరగతి ప్రజల సొంతింటి కలల్ని కూల్చేస్తూ.. కొందరు రియల్ ఎస్టేట్ మోసగాళ్లు ప్రీ-లాంచ్ పేరుతో బురిడీ కొట్టిస్తున్నారు. రెరా వచ్చినా.. హైడ్రా కొరడా ఝుళిపిస్తున్నా.. ప్రీలాంచ్ కేటుగాళ్ల ఆగడాలు మాత్రం ఆగట్లేదు. ఎప్పటికప్పుడు ప్రీలాంచ్ ఆఫర్లతో ఇంటి కొనుగోలుదారులను బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది 2025లో హైదరాబాద్ రియాల్టీ మార్కెట్లో సుమారు మూడు వేల కోట్ల రూపాయల విలువైన ప్రీలాంచ్ మోసాలు జరిగాయని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0