అభివృద్ధిలో అతి వేగం.. హైద‌రాబాద్‌

అభివృద్ధిలో అతి వేగం.. హైద‌రాబాద్‌

Feb 10, 2026 - 18:15
 0  3
అభివృద్ధిలో అతి వేగం.. హైద‌రాబాద్‌

* న‌గ‌రాల్లోనే నాలుగో స్థానం

ఆర్ధికపరమైన అంశాల్లో హైదరాబాద్ దేశంలోనే నాలుగవ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ తన సొంత పన్ను వనరుల నుంచే అత్యధిక  ఆదాయాన్ని పొందుతున్నట్లు కేంద్ర ఆర్థిక సర్వే పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో ద్రవ్యోల్బణం కూడా క్రమంగా తగ్గుతోందని.. 2022-23లో 8.61 శాతం ఉండగా 2023-24లో6.36, 2024-25లో 3.67 శాతానికి తగ్గిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో మంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నైతో పాటు హైదరాబాద్‌ కూడా అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందినట్లు తెలిపింది. భారతదేశం ఆర్థికంగా ముందంజ వేస్తున్నప్పటికీ న్యూయార్క్‌, లండన్‌, షాంఘై, సింగపూర్‌ల మాదిరిగా మన మెట్రో నగరాలు గ్లోబల్‌ సిటీలుగా మారేందుకు ఇంకా ప్రయత్నాలలోనే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. 2019-35 మధ్య అతివేగంగా పెరుగుతున్న నగరాల్లో సూరత్‌, ఆగ్రా, బెంగళూరు తర్వాత హైదరాబాద్‌ నాలుగో స్థానంలో ఉందని కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది. 2018 ధరలకు హైదరాబాద్‌ జీడీపీ 50.6 బిలియన్లు కాగా 2035 నాటికి అది 201.4 బిలియన్లకు చేరుకుంటుందన్న ప్రపంచ బ్యాంక్‌ అంచనాలను ఆర్థిక సర్వే ప్రస్తావించింది. 2019-35 మధ్య హైదరాబాద్‌ ఆర్థిక ప్రగతి 8.47 శాతం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0