బెంగళూరు రియాల్టీలోకి అడుగుపెట్టిన పౌలోమీ ఎస్టేట్స్
బెంగళూరు రియాల్టీలోకి అడుగుపెట్టిన పౌలోమీ ఎస్టేట్స్
* ప్రాజెక్టు విలువ.. సుమారు రూ.12,000 కోట్లు
* నార్త్ బెంగళూరులో నయా లగ్జరీ ప్రాజెక్టు
* నాణ్యతకు పెద్దపీట.. అత్యుత్తమ స్థాయి నిర్మాణం
హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ పౌలోమీ ఎస్టేట్స్ బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఈ కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలన్నీ సంస్థ డైరెక్టర్ ప్రశాంత్ రావు బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నార్త్ బెంగళూరులోని తన్నీసంద్రలో సుమారు తొమ్మిది ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నామని తెలిపారు. సుమారు రూ.1200 కోట్లు విలువ గల ఈ ప్రాజెక్టు నిమిత్తం ఇప్పటికే తాము భూమి కొనుగోలు, అనుమతుల నిమిత్తం సుమారు రూ.250 కోట్లను ఖర్చు చేశామని వెల్లడించారు. కంపెనీ సొంత నిధులు, ఆర్థిక సంస్థల రుణాలు, ప్రాజెక్టులో అమ్మకాలతో.. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామన్నారు. భారతీయ సెంటర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మాన్యతా టెక్ పార్కు వంటి వాటితో నార్త్ బెంగళూరు రెసిడెన్షియల్ హబ్‌గా ఎదుగుతోందన్నారు. సరికొత్తగా మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతం భవిష్యత్తులో గణనీయంగా వృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. స్కూళ్లు, కాలేజీలు, ఆస్పత్రులు, షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు వంటివి తమ ప్రాజెక్టుకు చేరువలో ఉన్నాయని తెలిపారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0