కోకాపేట్ నియోపోలిస్‌లో 4 ఎకరాల్ని సొంతం చేసుకున్న యూలా గ్రూప్
YULA GROUP BOUGHT 4 ACRES LAND IN KOKAPET NEOPOLIS AUCTION
కోకాపేట్ నియోపోలిస్‌లో యూలా గ్రూప్ నాలుగు ఎకరాల్ని సొంతం చేసుకుంది. బుధవారం నాడు కోకాపేట్ నియోపోలిస్ భూములకు సంబంధించి జరిగిన వేలం పాటలో.. నగరానికి చెందిన యూలా గ్రూప్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సంస్థ నాలుగు ఎకరాల ప్లాటును వేలంలో సొంతం చేసుకుంది. ఇందుకోసం ఎకరానికి రూ.131 కోట్లు వెచ్చించింది. నియోపోలిస్ నుంచి గండిపేట్ వ్యూ కనిపిస్తుండటంతో ఇక్కడి ఒక బ్యూటీఫుల్ కమ్యూనిటీని డెవలప్ చేసే అవకాశం ఉంటుందని.. అందుకే, ఈ నాలుగు ఎకరాల్ని ఆన్‌లైన్ వేలంలో యూలా గ్రూప్ సొంతం చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే యూలా గ్రూప్ నియోపోలిస్లో యూలా నియో అనే ప్రాజెక్టును డెవలప్ చేస్తున్న విషయం తెలిసిందే.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0