భార‌త‌దేశంలోనే అతి పెద్ద ఫ్లాట్.. హైద‌రాబాద్‌లో ఆవిష్క‌ర‌ణ‌

INDIA'S BIGGEST FLAT IS IN HYDERABAD.. DSR THE TWINS

Dec 19, 2025 - 14:16
 0  121
భార‌త‌దేశంలోనే అతి పెద్ద ఫ్లాట్.. హైద‌రాబాద్‌లో ఆవిష్క‌ర‌ణ‌

* చిన‌జీయ‌ర్ స్వామి చేతుల మీదుగా ఆవిష్క‌ర‌ణ‌
* డీఎస్ఆర్ ద ట్విన్స్‌.. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం.. 15,999 చ‌.అ.

డీఎస్ఆర్ బిల్డ‌ర్స్ ఆరంభించిన ద ట్విన్స్ ప్రాజెక్టును చిన‌జీయ‌ర్ ‌స్వామి శుక్రవారం సాయంత్రం ఆవిష్క‌రించారు. ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్‌లో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టు ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం 15,999 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. యావ‌త్ భార‌త‌దేశంలోనే అతి పెద్ద ఫ్లాట్లు క‌లిగిన ప్రాజెక్టుగా డీఎస్ఆర్ ద ట్విన్స్ రికార్డును సృష్టించింది. ఈ సంద‌ర్భంగా డీఎస్ఆర్ ఫౌండ‌ర్ డి. అభిషేక్ రెడ్డి ఆర్ఈజీ న్యూస్‌తో మాట్లాడుతూ.. జీవితాంతం ల‌గ్జ‌రీగా నివసించాల‌ని కోరుకునేవారికి త‌మ ప్రాజెక్టు చూడ‌చ‌క్క‌గా న‌ప్పుతుంద‌న్నారు. సంప్ర‌దాయ హైరైజ్ న‌మూనాల నుంచి కాస్త భిన్నంగా ఉండి.. స‌హ‌జసిద్ధ‌మైన వెలుతురు మ‌రింత ధారాళంగా ఫ్లాట్ల‌లోకి వ‌చ్చేలా డిజైన్ చేశామ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కైతే ఈ ప్రాజెక్టులో హైద‌రాబాద్ నుంచి అధిక శాతం మంది ఫ్లాట్ల‌ను కొనుగోలు చేశార‌ని తెలిపారు.

డీఎస్ఆర్‌ ద ట్విన్స్ ప్ర‌త్యేక‌త‌లివే..
ఈ ప్రాజెక్టు ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఫ్లోరుకు ఒకే ఫ్లాట్ ఉంటుంది. ఒక్కో ఫ్లాట్ విస్తీర్ణం సుమారు 15,999 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో సంస్థ డిజైన్ చేసింది. ఇందులో ప్రీమియం హైస్పీడ్ ఎలివేట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌డానికి సంస్థ షిండ్ల‌ర్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. సుస్థిర‌త విష‌యంలో పెద్ద పీట వేశారీ ప్రాజెక్టులో. కామ‌న్ ఏరియాల‌లో విద్యుత్ వినియోగాన్ని గ‌ణ‌నీయంగా త‌గ్గించేందుకు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. ప్రైవ‌సీ, కంఫ‌ర్ట్‌, విశాల‌మైన లివింగ్ స్పేసెస్‌, వాకిన్ వార్డ్ రోబ్స్‌, స్పా ప్రేరిత బాత్‌రూములు, అతి పెద్ద కిటికీలు వంటివి ద ట్విన్స్ ప్రాజెక్టుకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0