అన్వితా గ్రూప్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా బాల‌కృష్ణ‌

BALAKRISHNA IS THE BRAND AMBASSADOR FOR ANVITA GROUP

Jan 9, 2026 - 06:34
 0  132
అన్వితా గ్రూప్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా బాల‌కృష్ణ‌

హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన అన్వితా గ్రూప్ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప్ర‌ముఖ న‌టుడు బాల‌కృష్ణ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ విష‌యాన్ని అన్వితా సంస్థ ఎండీ అచ్యుత‌రావు తెలిపారు. శుక్ర‌వారం మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోట‌ల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. తెలుగు ప్ర‌జ‌ల‌కు సుప‌రిచితులైన న‌టుడు బాల‌కృష్ణ త‌మ కంపెనీకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌డానికి అంగీక‌రించినందుకు ఆనందం వ్య‌క్తం చేశారు. గ‌తంలో బాల‌కృష్ణ సాయిప్రియా క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ అనే రియ‌ల్ ఎస్టేట్ కంపెనీకి ప్ర‌చార‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు. ఆ త‌ర్వాత ఆయ‌న అన్వితా గ్రూప్ సంస్థ‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా అంగీక‌రించారు. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0