హైదరాబాద్‌లోని ఈ స్కై స్క్రేపర్‌లో.. ప్రతి గదికీ బాల్కనీ.. లార్జ్ లివింగ్ ఏరియా
Kokapet’s Poulomi Palazzo Emerges as Hyderabad’s Most Exclusive Ultra-Luxury Residential Tower
* పౌలోమి పలాజో ప్రత్యేకతలను వివరించిన సంస్థ డైరెక్టర్ ప్రశాంత్ రావు
* అపార్ట్ మెంట్ కు విల్లా కాన్సెప్ట్
* వర్షాకాలం, శీతాకాలంలో లోపలే వాకింగ్ చేసేందుకు జాగింగ్ ట్రాక్
* ఐదంతస్తుల వరకు క్లబ్ హౌస్.. అంతా పచ్చదనమే!
* కోకాపేట్ కొత్త ఫ్యూచర్ సిటీ
ప్రీమియం లగ్జరీ ప్రాజెక్టులంటే దుబాయ్ వైపు చూస్తాం. లగ్జరీ గృహాలకు ఆధునిక చిరునామాగా కనిపిస్తాయి అక్కడి నిర్మాణాలు. కానీ దుబాయ్ ను తలదన్నే రీతిలో నభూతో నభవిష్యత్ అనే విధంగా అట్టహాసంగా, అత్యాధునికంగా ఉబర్ లగ్జరీ ప్రాజెక్టుకు సరైన చిరునామాగా నిలుస్తోంది కోకాపేట్‌లోని పౌలోమి పలాజో. ఇక్కడి మోడల్ ప్లాట్ చూస్తే చాలు.. మరో లోకంగా ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది. అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. మరి ఈ ప్రాజెక్టు గురించి పౌలోమి ఎస్టేట్స్ డైరెక్టర్ ప్రశాంత్ రావు మాటల్లోనే తెలుసుకుందాం.
పౌలోమి పలాజో మూడేళ్ల క్రితం లాంచ్ చేశాం. హైదరాబాద్ లోని మోస్ట్ లగ్జరీ ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. ఏడాదిన్నరలోగా మొత్తం ప్రాజెక్టు పూర్తి అయిపోతుంది. మేం ఏదైతే ప్లాన్ చేశామో అలాగే దీనిని తీర్చిదిద్దాం. గత ఐదారేళ్లలో కోకాపేట అనేది ప్రీమియం డెస్టినేషన్ లాగా డెవలప్ అయింది. ఇంకా ఇక్కడ డిమాండ్ బాగా పెరుగుతుంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాలు కమర్షియల్ గా బాగా బిజీ కావడంతో చాలామంది ఇక్కడకు షిఫ్ట్ అవుదామని చూస్తున్నారు. ఫలితంగా కోకాపేటలో డిమాండ్ బాగా పెరిగింది. ఇటీవల ఇక్కడ జరిగిన వేలంలో పలికిన ధరలే ఇందుకు నిదర్శనం. గత మూడు, నాలుగేళ్ల నుంచి కోకాపేటలో చాలా హైరైజ్ ప్రాజెక్టులు వచ్చాయి. ఇంకా రానున్నాయి. పౌలోమి పలాజోతోపాటు చాలా ప్రీమియం ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. దీంతో ఇది ఫ్యూచర్ సిటీ కానున్నది.
పౌలోమి పలాజో విషయానికి వస్తే ఇది 55 అంతస్తుల ప్రాజెక్టు. మొత్తం 2.3 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 141 అపార్ట్ మెంట్లు ఉన్నాయి. అన్నీ 4 బీహెచ్ కే ఫ్లాట్లే. కేవలం రెండే పరిమాణాల్లో ఫ్లాట్లు ఉంటాయి. పెద్దది 8,100 చదరపు అడుగులు కాగా, చిన్నది 6,225 చదరపు అడుగులు ఉంటుంది. మా ఈ ప్రాజెక్టులో రెండు ప్రధాన అంశాలున్నాయి. ఒకటి డబుల్ హైట్ బాల్కనీ.. రెండోది పెద్ద లివింగ్ ఏరియా.. వెయ్యి చదరపు అడుగుల పైనే ఉంటుంది. ఈ రెండింటినీ కలిపితే 50 మంది నుంచి 100 మంది గెస్టులు భోజనం చేసే అంత ప్లేస్ వస్తుంది. తెలుగువాళ్లు గెస్టులను పిలవడం, కుటుంబ సభ్యులతో కలిసి పార్టీలను చేసుకోవడం సర్వసాధారణమే. ఈ నేపథ్యంలో 50 నుంచి 100 మంది గెస్టులు భోజనం చేసే అంత ఏరియా ఇక్కడ ఉంటుంది. అలాగే ప్రతి రూమ్ కీ ఒక బాల్కనీ వచ్చేలా ప్లాన్ చేశాం. మెయిన్ బాల్కనీ 24 అడుగుల ఎత్తు ఉంటుంది.
విల్లా కాన్సెప్ట్ ని అపార్ట్ మెంట్ లో డెవలప్ చేశాం. ప్రజలు నేచరల్ ఎయిర్ లో కూర్చుని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని దీనిని డిజైన్ చేశాం. వాస్తవానికి విల్లాలో ఉంటే అంత ప్రైవసీ ఉండదు. ఎదురుగా ఉండే లాన్ లో నైబర్స్ ఉంటారు. అందువల్ల మనం బాల్కనీలో కూర్చున్నా కూడా ప్రైవసీ ఉండదు. కానీ ఇక్కడ డబుల్ హైట్ ఎఫెక్స్ వల్ల ఓపెన్ గా ఉండే ఫీలింగ్ ఉంటుంది. పైగా ఎదురుగా ఎవరూ ఉండరు కాబట్టి కావాల్సినంత ప్రైవసీ ఉంటుంది. ఇక ఈ ప్రాజెక్టులో గ్రౌండ్ నుంచి ఐదో అంతస్తు వరకు క్లబ్ హౌస్ ఉంటుంది. అపార్ట్ మెంట్లు ఆరో ఫ్లోర్ నుంచి మొదలవుతాయి.
* క్లబ్ హౌస్ లో షటిల్ కోర్టు, స్క్వాష్ కోర్టు, వాలీబాల్, పికిల్ బాల్ కోర్టు, జిమ్, ఒలింపిక్ సైజ్ స్విమింగ్ పూల్ వంటివాటితోపాటు ఇండోర్ జాగింగ్ ట్రాక్ ఏర్పాటు చేశాం. పెద్దవాళ్లు వర్షాకాలం, చలికాలంలో బయట వాకింగ్ చేసే పరిస్థితి ఉండదు కాబట్టి, అలాంటి వారు లోపలే వాకింగ్ చేయొచ్చు. ట్రాక్ ను ఈపీడీఎం ఫ్లోరింగ్ తో ఏర్పాటు చేశాం. అందువల్ల పెద్దవాళ్ల మోకాళ్లకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. అలాగే 52వ ఫ్లోర్ లో ఇన్ఫినిటీ పూల్ ఉంది. అక్కడ నుంచి గండిపేట లేక్ కూడా కనపడుతుంది. వరల్డ్ క్లాస్ స్పా తోపాటు మల్టీపర్పస్ హాల్ కూడా ఉంది. సాధారణంగా ఏ అపార్ట్ మెంట్ కు వెళ్లినా ఆయా ఫ్లాట్ల బాల్కనీల్లో ఆరేసిన బట్టలు కనపడుతుంటాయి. అయితే, మన బిల్డింగ్ లో అపార్ట్ మెంట్లు 6వ ఫ్లోర్ నుంచి ప్రారంభమవుతాయి కాబట్టి కింద ఐదు అంతస్తులను గ్రీనరీతో నింపేశాం. ఎవరైనా అపార్ట్ మెంట్ లోకి ఎంటరైతే అన్ని వైపులా పచ్చదనమే కనపడుతుంది. ప్రస్తుతానికి 35వ ఫ్లోర్ శ్లాబ్ వేశాం. ఇంకా 20 ఫ్లోర్స్ నిర్మించాలి. వచ్చే ఏడాది చివరి నాటికి హ్యాండోవర్ చేసేలా ముందుకెళ్తున్నాం.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0