మాధురి బంగ్లా రూ.3.9 కోట్లకు విక్రయం

Bollywood actress Madhuri Dixit sells her Juhu luxury apartment for ₹3.9 crore, nearly doubling her investment, highlighting strong premium housing demand.

Dec 19, 2025 - 03:12
 0  86
మాధురి బంగ్లా రూ.3.9 కోట్లకు విక్రయం
madhuri-dixit-juhu-apartment-sold-3-9-crore-real-estate-news

బాలీవుడ్‌ నటి మధురీ దీక్షిత్‌ ముంబై జుహులోని తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను రూ.3.9 కోట్లకు విక్రయించారు. ఆమె కొన్నప్పటి కంటే ఇది రెట్టింపు ధర కావడం గమనార్హం. జుహూ ప్రాంతంలోని వర్ష కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీఐరిస్ పార్క్‌లో 780.13 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ అపార్ట్‌మెంట్‌ను 2012లో మాధురి దీక్షిత్‌ఆమె భర్త శ్రీరామ్‌ మాధవ్‌ కలిసి రూ.1.95 కోట్లకు కొనుగోలు చేశారు. తాజాగా దానిని రూ.3.9 కోట్లకు విక్రయించారు. తద్వారా 99.22 శాతం లాభం పొందారు. ఓ మహిళ వీరి దగ్గర నుంచి ఆ ఫ్లాట్‌ను కొన్నట్టు సమాచారం. డిసెంబర్‌ 15న రిజిస్ట్రేషన్‌ జరగ్గా.. స్టాంపు డ్యూటీ కింద రూ.19.5 లక్షలు చెల్లించారు. మహారాష్ట్ర ప్రభుత్వం మహిళా గృహ కొనుగోలుదారులకు అందించే 1% రాయితీని ఆమె పొందినట్టు రిజిస్ట్రేషన్‌ పత్రాలు వెల్లడించాయి. కాగాఅదే సొసైటీలోని వేరే ఫ్లాట్‌కు అనుసంధానంగా ఉన్న ఓ పార్కింగ్‌ స్థలాన్ని మాధురి రూ.15 లక్షలకు విక్రయించారు. గత సంవత్సరం ఆమె ముంబైలోని అంధేరీ వెస్ట్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రాపర్టీని నెలకు రూ.3 లక్షల అద్దెకు కరంతారా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రెండేళ్ల కాలానికి ఇచ్చారు. అలాగే ఆమె 2022లో ముంబై లోయర్ పరేల్ ప్రాంతంలోని ఇండియాబుల్స్ బ్లూ ప్రాజెక్ట్‌లో ఉన్న లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను రూ.48 కోట్లకు కొన్నారు. 53వ అంతస్తులో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ విస్తీర్ణం 5,384 చదరపు అడుగులు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0