లగ్జరీ మార్కెట్ రయ్ రయ్

India’s luxury housing market set to surge from $17B in 2024 to $103B by 2030, driven by rising demand in Mumbai, Gurugram, Bengaluru and Hyderabad, says Magicbricks.

Dec 5, 2025 - 00:40
 0  25
లగ్జరీ మార్కెట్ రయ్ రయ్
india-luxury-housing-market-growth-magicbricks-report-2030

-      2030 నాటికి 103 బిలియన్ డాలర్లకు చేరే ఛాన్స్

-      2024లో 17 బిలియన్ డాలర్ల మార్కెట్

-      మ్యాజిక్ బ్రిక్స్ నివేదిక వెల్లడి

దేశ రియల్ రంగంలో లగ్జరీ మార్కెట్ జోరుగా పరుగులు తీస్తోంది. కోవిడ్ తర్వాత విశాలమైన, లగ్జరీ ఇళ్లు చాలామంది ప్రాధాన్యతగా మారిన నేపథ్యంలో ఏటా ఈ విభాగం వాటా పెరుగుతూ వస్తోంది. 2024లో లగ్జరీ మార్కెట్ వాటా 17 బిలియన్ డాలర్లు ఉండగా.. 2030 నాటికి 35 శాతం వార్షిక వృద్ధితో 103 బిలియన్ డాలర్లకు చేరుతుందని మ్యాజిక్ బ్రిక్స్ తాజా నివేదిక అంచనా వేసింది. 'ఇండియా లగ్జరీ హౌసింగ్ మార్కెట్ రిపోర్ట్ 2025అనే నివేదికలో దీనికి సంబంధించి పలు విషయాలు ప్రస్తావించారు. భారతదేశ లగ్జరీ రెసిడెన్షియల్ విభాగం ఏటా పెరుగుతూ.. ముంబైఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు వంటి సాంప్రదాయ కేంద్రాలకు మించి విస్తరిస్తోందని పేర్కొంది. టైర్-1 నగరాల్లో లగ్జరీ ప్రైస్ ఇండెక్స్ (ఎల్ పీఐ) 2021లో 2.32 ఉండగా.. 2025లో 2.27కి తగ్గిందని పేర్కొంది. లగ్జరీయేతర గృహాల ధరలు కూడా క్రమంగా పెరగడంతోనే ఈ పరిస్థితి నెలకొందని వివరించింది. అదే సమయంలో అభివృద్ధి చెందుతున్న లగ్జరీ కారిడార్లలో ఎల్ పీఐ 1.00 నుంచి 1.44కి పెరిగింది. దీనికి డిమాండ్ 27% పెరుగుదల, సరఫరా 86% పెరుగుదల కారణమయ్యాయి. ముంబై సగటు లగ్జరీ ఇంటి ధర రూ. 9.66 కోట్లు కాగాగురుగ్రామ్ (రూ. 5.46 కోట్లు)బెంగళూరు (రూ. 2.91 కోట్లు), హైదరాబాద్ (రూ. 2.20 కోట్లు)గా ఉన్నాయి.  గత నాలుగు సంవత్సరాలలో అనేక సూక్ష్మ మార్కెట్లు తమ లగ్జరీ మార్కెట్ లో కీలక మార్పులు నమోదు చేశాయి. నోయిడా ఎక్స్ ప్రెస్‌వేలో లగ్జరీ వాటా 2021లో 10% నుంచి 2025లో 47 శాతానికి, బెంగళూరులోని దేవనహళ్లిలో 9% నుంచి 40 శాతానికికోల్‌కతాలోని బల్లిగంజ్ లో 12% నుంచి 50 శాతానికి, గోవాలోని పోర్వోరిమ్ లో 19% నుంచి 47 శాతానికి పెరిగాయి. డెవలపర్లు కూడా పెద్ద యూనిట్లుప్రీమియం స్పెసిఫికేషన్లు, హై-ఎండ్ సౌకర్యాలపై దృష్టి సారించినందున లగ్జరీ గృహాలు ఇప్పుడు మొత్తం గృహ సరఫరాలో 27% వాటాను కలిగి ఉన్నాయి.  రూ. 2-3 కోట్లు, రూ.3-5 కోట్ల ధరల పరిధిలో ఇళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. అలాగే రూ. 10 కోట్ల కంటే ఎక్కువ అల్ట్రా-ప్రీమియం ఇళ్ల కొనుగోళ్లు ముంబై, గురుగ్రామ్‌లో ఎక్కువగా ఉన్నాయి. ప్రీమియైజేషన్ నగర మార్కెట్లను మారుస్తోందని నివేదిక పేర్కొంది. బెంగళూరు 48%తో అత్యధిక ప్రీమియం వాటాను కలిగి ఉంది. తరువాత గురుగ్రామ్ (43%)హైదరాబాద్ (29%)పూణే (24%), కోల్‌కతా (19%) ఉన్నాయి. ముంబై 13% తక్కువ ప్రీమియం వాటాను నమోదు చేసింది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0