సీఏకి టోకరా.. రియల్ ఏజెంట్ అరెస్ట్

REAL ESTATE AGENT ARRESTED IN MUMBAI FOR DUPING CHARTED ACCOUNTANT

Jan 9, 2026 - 10:33
Jan 9, 2026 - 10:42
 0  62
సీఏకి టోకరా.. రియల్ ఏజెంట్ అరెస్ట్

ఫ్లాట్ అమ్మకంలో ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ను మోసం చేసిన కేసులో రియల్ ఎస్టేట్ ఏజెంట్ కటకటాలపాలయ్యాడు. దక్షిణ ముంబైలోని దహిసర్ కు చెందిన హితేష్ మన్ సుఖ్ భాయ్ గోండ్వాలియా చార్టర్డ్ అకౌంటెంట్. అద్దె ఫ్లాట్ లో నివసిస్తున్న హితేష్.. ప్రాపర్టీ కొనుగోలు కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో ఆన్ లైన్ లో 1.05 కోట్ల ధరతో ఉన్న ప్లాట్ చూసి ఆ నెంబర్ కు కాల్ చేశారు. తన పేరును ఆదిత్య అని పరిచయం చేసుకున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్.. రావల్పడా ప్రాంతంలోని ఫ్లాట్ చూడటానికి రావాలని ఆహ్వానించాడు. దీంతో హితేష్ తన తండ్రితో కలిసి వెళ్లి ఫ్లాట్ చూసి కొనాలని నిర్ణయించుకున్నారు. ఆదిత్య వారికి దీపక్ కిరిత్ షా, రాజేష్ జైన్‌లను పరిచయం చేశాడు. జైన్ ఆ ప్రాపర్టీ యజమాని అని, షా లావాదేవీని చూసుకుంటున్న బ్రోకర్ అని వివరించాడు. అన్నీ మాట్లాడుకున్న తర్వాత హితేష్ వారికి రూ.29.55 లక్షలు చెల్లించారు. సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ తర్వాత బ్యాంకు రుణం ద్వారా మిగిలిన మొత్తం తీసుకోవాలని ఆయన భావించారు. కానీ నిందితులు వివిధ కారణాలు చెప్పి రిజిస్ట్రేషన్‌ను వాయిదా వేస్తూ వచ్చారు. దీంతో అనుమానం రావడంతో హితేష్.. తహసీల్దార్ కార్యాలయంలో ఫ్లాట్ యాజమాన్య వివరాలను తనిఖీ చేయగా, అది వేరొకరిదని తెలిసి షాక్ అయ్యారు. నిందితులు అసలు యజమాని ఫోటో స్థానంలో జైన్ ఫోటోను పెట్టి నకిలీ పత్రాలను అందించారని గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగి షాను అరెస్టు చేశారు. ఆదిత్య, జైన్ కోసం గాలిస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0