ఫ్యూచర్ సిటీ సహా తెలంగాణకు రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు
Telangana attracts ₹5.75 lakh crore investments at the Global Summit, including Future City, data centres, pharma, tourism, sports and manufacturing projects with massive job creation.
గ్లోబల్ సమ్మిట్ లో ప్రధానంగా ఐటీ, విద్యుత్, క్రీడలు, పర్యాటకం, అటవీ తదితర శాఖల్లో పెట్టుబడులకు అంతర్జాతీయ కంపెనీలు ఆసక్తి చూపాయి. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ అభివృద్ధి చెందాలనే సంకల్పంతో.. నిర్వహించిన రెండు రోజుల గ్లోబల్ సదస్సులో పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా లక్ష్యం విజయవంతమైంది. తెలంగాణ పర్యాటక రంగంలో ఏకంగా రూ.7,045 కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు కుదిరాయి. ప్రత్యక్షంగా 10వేల మందికి, పరోక్షంగా 30వేల మందికి ఉపాధి లభించనుంది.
* భారత్ ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ క్రీడా సంస్థలు ముందుకొచ్చాయి. రూ.1000 కోట్లతో శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తామని దుబాయ్ జీఎంఆర్ స్పోర్ట్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. జీఎంఆర్ స్పోర్ట్స్ ఛైర్మన్ గ్రంథి కిరణ్‌కుమార్ ఆధ్వర్యంలోని బృందం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసింది. సీఎం సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ సహకారంతో అత్యాధునిక శిక్షణ వసతులు, స్టేడియాలు, స్పోర్ట్స్ సైన్స్ సెంటర్లు, అనుబంధ మౌలిక వసతులతో జీఎంఆర్ శాటిలైట్ స్పోర్ట్స్ సిటీని నిర్మిస్తామని వెల్లడించింది. రూ.1000 కోట్లతో డ్రీమ్ వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్‌ను నిర్మించనున్నారు. ఇండియా ఎక్స్‌ట్రీమ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. మూడు దశలలో 20 ఎకరాల్లో ఎక్స్‌ట్రీమ్ స్పోర్ట్స్, అడ్వెంచర్, ఈ-స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఎరీనాను ఏర్పాటు చేస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది. సూపర్‌క్రాస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మోటార్ రేసింగ్ సంస్థ రూ.75 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
తెలంగాణ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాలు...
ఏజీపీ గ్రూప్- రాష్ట్రంలో 125 ఎకరాల్లో ఒక గిగావాట్ హైపర్ స్కేల్ డీసీ క్యాంపస్ ఏర్పాటు చేస్తుంది. ఇక్కడే బెస్(బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం) సదుపాయాన్ని అభివృద్ధి చేస్తుంది. రూ.6,750 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
బయలాజికల్ ఈ లిమిటెడ్- సీడీఎంవో(కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్) యూనిట్ ఏర్పాటు చేయడానికి రూ.3,500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇంతకు ముందు ప్రకటించిన రూ.500 కోట్ల పెట్టుబడికి ఇది అదనం. దీనికి గ్రీన్ ఫార్మా సిటీలో ప్రభుత్వం 150 ఎకరాల స్థలం కేటాయిస్తుంది. దీని ద్వారా 3,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
ఫుడ్‌లింక్ ఎఫ్ అండ్ బి హోల్డింగ్స్ ఇండియా- రూ.3,000 కోట్లు.
ఆర్‌సీటీ ఎనర్జీ ఇండియా- మూడు దశల్లో రూ.2,500 కోట్ల పెట్టుబడి పెట్టి.. 1,600 మందికి ఉద్యోగాలు కల్పించనుంది.
ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్- అత్యాధునిక ఆహార, వ్యవసాయ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. దీంతో పాటు అల్యూలోజ్, గ్లైకైన్ బేస్‌డ్ ఇంగ్రేడియంట్స్, స్లో రిలీజ్ కార్బోహైడ్రేట్స్ వంటివాటిని ఉత్పత్తి చేసే యూనిట్‌ను స్థాపిస్తుంది. రూ.2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 100 ఎకరాల భూమి కేటాయిస్తుంది. వచ్చే రెండేళ్లలో తమ ప్రాజెక్టుల ద్వారా 800 కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.
అరబిందో ఫార్మా- రూ.2,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ నిధులతో సంక్లిష్టమైన జనరిక్ ఔషధాలు, ఇంజెక్టబుల్స్, బయో సిమిలర్ ఔషధాలను ఉత్పత్తి చేసే యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. దీనివల్ల వచ్చే రెండు, మూడేళ్లలో 3,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
హెటిరో గ్రూప్- రూ.1,800 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో ఫార్మా యూనిట్లను నెలకొల్పనుంది. దీనివల్ల 9,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ సంస్థకు ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయిస్తుంది.
రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్- పలు ఆహార ఉత్పత్తుల తయారీ కోసం కొత్త యూనిట్‌ను స్థాపించనుంది. దీనికి ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయిస్తుంది. రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టి.. 1,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది.
గ్రాన్యూల్స్ ఇండియా- క్యాన్సర్ ఔషధాల ఉత్పత్తికి రూ.1,200 కోట్ల పెట్టుబడితో సీడీఎంవో(కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్) యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీనివల్ల సుమారు 3,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
వింటేజ్ కాఫీ అండ్ బెవరేజ్ లిమిటెడ్- ఎగుమతుల కోసం ‘ప్రీమియం ఫ్రీజ్ డ్రైడ్ ఇన్‌స్టెంట్ కాఫీ’ ఉత్పత్తి చేసే యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. దీనిపై రూ.1,100 కోట్ల పెట్టుబడి పెడతారు. ఈ సంస్థకు 15 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. రెండేళ్లలో 1,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
బయోవరం కంపెనీ- రాష్ట్రంలో రూ.250 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. బయోవరం ఫార్మా గ్రూప్ ఛైర్మన్ వరప్రసాద్‌రెడ్డి, సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశమై ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(టిష్యూ ఇంజినీరింగ్, బయో మెటీరియల్స్, రీజనరేటివ్ మెడిసిన్, కణ జన్యు చికిత్స) ఏర్పాటు చేసి 200 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది.
టీడబ్ల్యూఐ గ్రూప్- రూ.1,100 కోట్లు.
డ్రీమ్‌వాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్- రూ.1,000 కోట్లు.
సారస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్- రూ.1,000 కోట్లు.
భారత్ బయోటెక్- రూ.1,000 కోట్ల పెట్టుబడితో సీఆర్‌డీఎంవో(కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్‌మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్) యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీనివల్ల వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో 200 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్- ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ కార్యకలాపాల విస్తరణపై రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది.
అట్మాస్పియర్ కోర్ హోటల్స్(మాల్దీవులు)- రూ.800 కోట్లు.
కేజేఎస్ ఇండియా సంస్థ- రూ.650 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థకు ప్రభుత్వం 44 ఎకరాల భూమి కేటాయించింది. ఆహార పానీయాల తయారీ యూనిట్‌ను నెలకొల్పనుంది. దీని ద్వారా రెండేళ్లలో 1,551 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ అండ్ యానిమేషన్.. పార్టనర్‌షిప్ ఫర్ ఐఐఎఫ్‌ఏ ఉత్సవ్ అండ్ ఏథెన్స్ ఈవెంట్స్- రూ.550-600 కోట్లు.
మహీంద్రా అండ్ మహీంద్రా- రూ.500 కోట్లు పెట్టుబడితో జహీరాబాద్‌లోని యూనిట్‌ను విస్తరిస్తుంది. ఇక్కడ కొత్తగా ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు తయారు చేస్తారు.
పోలిన్ గ్రూప్(టర్కీ)- రూ.300 కోట్లు
ఫ్లూయిడ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(స్పెయిన్)- రూ.300 కోట్లు.
శ్రీ హవిషా హాస్పిటాలిటీ అండ్ ఇన్‌ఫ్రా- రూ.300 కోట్లు.
కేఈఐ గ్రూప్ అండ్ అసోసియేట్స్(కామినేని గ్రూప్)- రూ.200 కోట్లు
గోద్రెజ్ గ్రూప్- పాడి పరిశ్రమ విస్తరణకు రూ.150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 40 ఎకరాల భూమి కేటాయించింది. ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే రెండేళ్లలో 300 ఉద్యోగాలు కల్పించనున్నట్లు గోద్రెజ్ గ్రూప్ వెల్లడించింది.
రిథిర గ్రూప్- రూ.120 కోట్లు
సలామ్ నమస్తే దోశ హట్(ఆస్ట్రేలియా) అండ్ వైజాగ్ రిక్రియేషన్- రూ.25 కోట్లు.
అక్విలాన్ నెక్సస్ లిమిటెడ్- రిటైల్, ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల కోసం 50 మెగా వాట్ల డేటా సెంటర్‌ను నెలకొల్పనుంది.
పర్వ్యూ గ్రూప్- జీసీసీ, 50 మెగావాట్ల ఏఐ డ్రైవిన్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీనివల్ల 3,000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. దీనికి ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయిస్తుంది.
జ్యూరిక్ ఇన్సూరెన్స్(జీసీసీ)- భారత్‌లో తొలి జీసీసీ కోసం హైదరాబాద్‌ను ఎంపిక చేసుకుంది. మూడేళ్లలో దశలవారీగా విస్తరించనుంది.
కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్(జీసీసీ).
మ్యాగ్జిమస్(యూఎస్)- గ్లోబల్ పబ్లిక్ సెక్టార్ టెక్నాలజీ ఆపరేషన్స్ హబ్ హైదరాబాద్‌లో ఏర్పాటు.
అనలాగ్ ఏఐ(అలెక్స్ కిప్‌మాన్)- హైదరాబాద్‌లో గ్లోబల్ పరిశోధన- ప్రొటోటైపింగ్ ల్యాబ్ ఏర్పాటు.
సుమధుర గ్రూప్- కొత్త టౌన్‌షిప్, మధ్యతరగతి నివాస సముదాయాల ప్రతిపాదనలు.
టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ.
ఎంఎస్‌ఎన్ గ్రూప్ ఫార్మా- లైఫ్ సైన్సెస్ రంగాల్లో విస్తరణ.
ఆల్ట్‌మిన్- బ్యాటరీ ముడిపదార్థాల తయారీ కేంద్రం.
అజయ్ దేవగణ్ ఫిల్మ్ స్టూడియో- వీఎఫ్‌ఎక్స్, వర్క్‌షాప్‌ల వంటి ఫిల్మ్ ఎకోసిస్టం అభివృద్ధి.
బ్లాక్‌స్టోన్ ఏషియా- డేటా సెంటర్లు, లాజిస్టిక్‌పార్కులు, కమర్షియల్ స్పేస్‌లలో పెట్టుబడులు.
విజ్జీ హోల్డింగ్స్- మల్టీ-ఒమిక్స్, డిజిటల్ ట్విన్, ప్రిసిషన్ హెల్త్ పరిశోధన కోసం ఆధునిక కేంద్రం ప్రతిపాదన.
సత్వ గ్రూప్- సమగ్ర పట్టణాభివృద్ధి, స్టూడెంట్- సీనియర్ లివింగ్ ప్రాజెక్టులపై చర్చలు.
బ్రిగేడ్ గ్రూప్- సమగ్ర టౌన్‌షిప్ ప్రతిపాదనపై చర్చ.
తెలంగాణ-యూఏఈ-ఆఫ్రికా పెట్టుబడులపై చర్చలు
సీఎంతో యూఏఈ, ఇతర దేశాల ప్రతినిధుల భేటీ
డ్రీమ్ వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ - రూ.1000 కోట్లు
ఎక్స్‌ట్రీమ్ అడ్వెంచర్స్ పెట్టుబడి రూ.500 కోట్లు
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0