శాంటాక్రూజ్ బంగ్లా.. రూ.164 కోట్లు

Mumbai records another luxury real estate deal as a Santacruz West bungalow on Linking Road is sold for ₹164 crore, reflecting strong premium housing demand.

Dec 19, 2025 - 03:22
 0  4
శాంటాక్రూజ్ బంగ్లా..   రూ.164 కోట్లు
santacruz-west-bungalow-sold-164-crore-mumbai-real-estate-deal

-      ముంబైలో మరో భారీ డీల్

ముంబై రియల్ ఎస్టేట్ లో మరో భారీ లావాదేవీ నమోదైంది. శాంటాక్రూజ్ వెస్ట్ లోని ఓ బంగ్లాను లగ్జరీ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన జేవైజే బిల్డర్స్ రూ.164 కోట్లకు కొనుగోలు చేసింది. ద్వారాకా బంగ్లా అని పేరున్న ఈ ప్రాపర్టీ శాంటాక్రూజ్ వెస్ట్ లోని లింకింగ్ రోడ్‌లో ఉంది. 1,266.7 చదరపు మీటర్లు (సుమారు 13,629 చదరపు అడుగులు) విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఎస్టేట్‌లో గ్యారేజ్, హెల్పర్ సహాయక షెడ్‌లతో పాటు గ్రౌండ్-ప్లస్-వన్ నిర్మాణం ఉంది. 

రిజిస్ట్రేషన్ గతనెల 17న జరగ్గా.. కంపెనీ రూ.9.8 కోట్ల స్టాంపు డ్యూటీ చెల్లించింది. కాగా, జేవైజే డెవలపర్స్ ప్రస్తుతం శాంటాక్రూజ్ వెస్ట్ లోని 16వ రోడ్డులో సీక్వోయా అనే ప్రాజెక్టును నిర్మిస్తోంది. ఈ నేపథ్యంలోనే ద్వారకా బంగ్లాను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. సీక్వోయా వంటి లగ్జరీ డెవలప్‌మెంట్‌లకు అనుగుణంగా దీనిని ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా తిరిగి అభివృద్ధి చేయాలని కంపెనీ యోచిస్తున్నట్టు సమాచారం. కాగా, ఈ ఏడాది మార్చిలో భారత స్వాతంత్ర్య ఉద్యమంతో ముడిపడి ఉన్న నేపియన్ సీ రోడ్‌లోని లక్ష్మీ నివాస్ అనే బంగ్లాను కపాడియా కుటుంబం రూ. 276 కోట్లకు వాగేశ్వరి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించింది. ఆ తర్వాత జరిగిన అతిపెద్ద లావాదేవీల్లో ద్వారకా బంగ్లా ఒకటి. అలాగే ఉదయ్ కోటక్, ఆయన కుటుంబ సభ్యులు వర్లీ సీ ఫేస్‌లోని శివ్ సాగర్ బిల్డింగ్ అనే నివాస సముదాయంలో సముద్రానికి అభిముఖంగా ఉన్న 12 అపార్ట్ మెంట్లను రూ.202 కోట్లకు కొనుగోలు చేశారు. 2024లో దివంగత బిలియనీర్, స్టాక్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా భార్య రేఖా ఝున్‌ఝున్‌వాలా దక్షిణ ముంబైలోని మలబార్ హిల్‌లో ఉన్న తన ఇంటి నుంచి అరేబియా సముద్రం వీక్షణకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు దక్షిణ ముంబైలోని ఒక నివాస భవనంలోని దాదాపు అన్ని యూనిట్లను కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. దేశంలోనే అతిపెద్ద ప్రాపర్టీ ఒప్పందాలలో ఒకటిగా భావిస్తున్న ఒక లావాదేవీలో డి-మార్ట్ వ్యవస్థాపకుడు రాధాకృష్ణ దమాని కుటుంబ సభ్యులు, సహచరులు 2023లో ముంబైలోని వర్లీలో రూ.1,238 కోట్ల విలువైన 28 గృహ యూనిట్లను కొనుగోలు చేశారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0