జీసీసీ లీజింగ్.. హైదరాబాద్ రైజింగ్
Hyderabad secures 2nd place in India’s GCC leasing market with 17% share and 18.6 million sq ft office space from 2020–24, says Savills India report.
- దేశంలో 17 శాతం వాటాతో రెండో స్థానం
- మొదటి స్థానంలో బెంగళూరు
- శావిల్స్ ఇండియా నివేదిక వెల్లడి
గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీ) లీజింగ్ లో హైదరాబాద్ దూకుడు ప్రదర్శిస్తోంది. 2020-24 మధ్య కాలంలో 18.6 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌తో దేశం మొత్తం మీద 17 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది. ఈ విషయంలో బెంగళూరు తొలి స్థానంలో ఉంది. ఈ మేరకు వివరాలను శావిల్స్ ఇండియా రూపొందించిన తాజా నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా 112 మిలియన్ చదరపు అడుగుల జీసీసీల లీజింగ్ నమోదు కాగా.. అందులో బెంగళూరు, హైదరాబాద్, పుణె కలిసి 70 శాతం వాటాతో ఉన్నాయి. అలాగే 2020-24 మధ్య కాలంలో మొత్తం కమర్షియల్ ఆఫీస్ స్పేస్ లీజింగ్ 262 మిలియన్ చదరపు అడుగులుగా ఉండగా.. జీసీసీ లీజింగ్ వాటా 112 మిలియన్ చదరపు అడుగులతో 43 శాతంగా నమోదైంది. హెల్త్ కేర్, ఫార్మా జీసీసీల విషయంలో బెంగళూరు, పుణెలతో పాటు హైదరాబాద్ అగ్రగామిగా ఉంది. దేశంలో ప్రస్తుతం 1,800 జీసీసీలు ఉండగా, 19 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 2030 నాటికి ఈ సంఖ్య 2,200 జీసీసీలు, 28 లక్షల మంది ఉద్యోగులకు చేరనుందని అంచనా. 2030 నాటికి జీసీసీల లీజింగ్ ఏటా 30 మిలియన్ చ.అ. మేర పెరగనుందని అంచనా వేస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0