ఫ్లెక్సీ స్పేస్ దూకుడు

India’s flex office market may cross 100 million sq ft by 2027, driven by GCCs and enterprises, says Colliers India. Demand rising across metros.

Dec 19, 2025 - 03:25
 0  3
ఫ్లెక్సీ స్పేస్ దూకుడు
flex-office-space-india-growth-2027-colliers-report

-      2027 నాటికి 100 మిలియన్ 

చదరపు అడుగులకు చేరే చాన్స్

-      కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడి

దేశంలో ఫ్లెక్స్ మార్కెట్ జోరుగా సాగుతోంది. 2027 నాటికి మనదేశంలో ఫ్లెక్స్ ఆఫీస్ స్పేస్ విభాగం 100 మిలియన్ చదరపు అడుగులు దాటే అవకాశం ఉందని కొలియర్స్ ఇండియా తాజా నివేదిక వెల్లడించింది. ఎంటర్ ప్రైజెస్, జీసీసీల డిమాండే ఇందుకు కారణమని పేర్కొంది. ప్రస్తుతం ఇది 72.3 మిలియన్ చదరపు అడుగులుగా ఉందని.. 2030 నాటికి 100 మిలియన్ చదరప అడుగులు దాటడం ఖాయమని అంచనా వేసింది. ప్రస్తుతం మొత్తం స్టాక్ లో 31% వాటాతో బెంగళూరు అతిపెద్ద ఫ్లెక్స్ మార్కెట్‌గా కొనసాగుతుండగా.. పూణే 11.5% వ్యాప్తితో రెండో స్థానంలో ఉంది. 

మొత్తం ఆఫీస్ స్టాక్ లో ఫ్లెక్స్ స్థలాల వాటా కూడా క్రమంగా పెరుగుతోంది. ఫ్లెక్స్ వ్యాప్తి 2025లో 8.5% ఉండగా.. 2027 నాటికి 10.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. 2024, 2025లో చూసిన 160,000 సీట్లతో పోలిస్తేవచ్చే రెండేళ్లలో సగటు వార్షిక సీట్ల వినియోగం 25% పెరిగి దాదాపు 200,000 సీట్లకు చేరుకుంటుందని అంచనా వేసినట్టు తెలిపింది. ఫ్లెక్స్ ఆపరేటర్లు అహ్మదాబాద్చండీగఢ్కొచ్చికోయంబత్తూర్, జైపూర్ వంటి టైర్-2 నగరాల్లో తమ విస్తరణను వేగవంతం చేస్తున్నారని వెల్లడించింది. ఈ మార్కెట్లలో అద్దెలు టైర్-1నగరాల కంటే 3035 శాతం తక్కువగా ఉన్నాయి. ఇవి హబ్-అండ్-స్పోక్, డిస్ట్రిబ్యూటెడ్ వర్క్ ఫోర్స్ మోడళ్లను అవలంబిస్తున్నందున ఆకర్షణీయమైన ఖర్చు ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. 2027 నాటికి భారతదేశంలోని ఫ్లెక్స్ స్టాక్‌లో టైర్-2 నగరాలు 1015 శాతం వాటాను కలిగి ఉండవచ్చని కొలియర్స్ అంచనా వేసింది. టెక్నాలజీ, బీఎఫ్ఎస్ఐలు డిమాండ్‌లో 6065 శాతం నడిపిస్తాయని అంచనా. భారతదేశ ఫ్లెక్స్ మార్కెట్ విస్తరణ కీలకమైన యుగంలోకి ప్రవేశిస్తోందని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ అర్పిత్ మెహ్రోత్రా అన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0