కొత్త ప్రాజెక్టుల‌కు ఇదే అడ్వాంటేజీ!

Strong land auctions in Kokapet and Rayadurg have boosted buyer sentiment, giving new Hyderabad real estate projects a big advantage going into 2026.

కొత్త ప్రాజెక్టుల‌కు ఇదే అడ్వాంటేజీ!
hyderabad-real-estate-2026-outlook-kokapet-neopolis-auctions
2025 చివ‌రి త్రైమాసికం నుంచి మార్కెట్లో సానుకూల దృక్ప‌ధం ఏర్ప‌డింది. ఇప్ప‌టివ‌ర‌కూ వేచి చూసే ధోర‌ణీని అల‌వ‌ర్చుకున్న వారంతా.. క్ర‌మ‌క్ర‌మంగా ఫ్లాట్ల‌ను కొనుగోలు చేయ‌డం మీద దృష్టి సారించ‌డం మొద‌లెట్టారు. ముఖ్యంగా కోకాపేట్ నియోపోలిస్‌లో హెచ్ఎండీఏ నిర్వ‌హించిన‌ వేలం పాట‌ల ద్వారా మార్కెట్‌కు మంచి పాజిటివ్ ఎన‌ర్జీని ఇచ్చాయి. ఎక‌రానికి 130 నుంచి 150 కోట్లు ప‌ల‌క‌డంతో‌.. ప్ర‌స్తుతం న‌గ‌రంలో నిర్మాణాలు జ‌రుపుకుంటున్న  ప్రాజెక్టుల విలువ కూడా పెరిగిన‌ట్లేన‌ని హైద‌రాబాద్ రియ‌ల్ మార్కెట్ భావిస్తోంది. మొత్తానికి, రాయ‌దుర్గం, కోకాపేట్ వంటి ప్రాంతాల్లో నిర్వ‌హించిన వేలం పాట‌లు మార్కెట్‌లో మంచి జోష్‌ను నింపాయి. దీంతో, వ‌చ్చే ఆరు నుంచి తొమ్మ‌ది నెల‌ల్లోపు పూర్త‌య్యే ప్రాజెక్టులకు మాత్రం మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. మొత్తానికి, 2026లో హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ మార్కెట్ మెరుగైన ప‌నితీరును ప్ర‌ద‌ర్శించే అవ‌కాశ‌ముంద‌ని హైద‌రాబాద్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0