వాస‌వి అర్బ‌న్‌ బ‌య్య‌ర్లు భ‌య‌ప‌డ‌క్క‌ర్లేదు.. 

Buyers of flats in the Vasavi Urban project at Bachupally need not worry about the handover timeline, assured Abhishek Chanda, Director of the company. Speaking at a press conference held in Begumpet on Monday, he announced the handover schedule for various blocks of the project.

Dec 1, 2025 - 10:41
 0  267
వాస‌వి అర్బ‌న్‌ బ‌య్య‌ర్లు భ‌య‌ప‌డ‌క్క‌ర్లేదు.. 

* బ్లాకుల హ్యాండోవ‌ర్‌పై స్ప‌ష్ట‌త‌
* 2026 ఏప్రిల్ నుంచి హ్యాండోవ‌ర్ స్టార్ట్  
* ద‌శ‌ల‌వారీగా ఫ్లాట్ల అంద‌జేత 
* గుడ్ విల్ స‌పోర్టును ప్ర‌క‌టించిన వాస‌వి
* ప్ర‌తి ఫ్లాటుకు నెల‌కు రూ.7000
* 2025 సెప్టెంబ‌రు నుంచి ప‌రిహారం

బాచుప‌ల్లిలోని వాస‌వి అర్బ‌న్ ప్రాజెక్టులో ఫ్లాట్లు కొన్న‌వారు హ్యాండోవ‌ర్ విష‌యంలో ఎలాంటి భ‌యాలు పెట్టుకోనక్క‌ర్లేద‌ని సంస్థ డైరెక్ట‌ర్ అభిషేక్ చందా భ‌రోసానిచ్చారు. సోమ‌వారం బేగంపేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. వాస‌వి అర్బ‌న్ ప్రాజెక్టుకు సంబంధించి వివిధ బ్లాకుల హ్యాండోవ‌ర్ తేదీల‌ను వెల్ల‌డించారు. 4,7,10వ బ్లాకుల‌ను 2026 ఏప్రిల్‌లో బ‌య్య‌ర్ల‌కు అంద‌జేస్తామ‌ని.. ఇందుకు సంబంధించిన ఆక్యుపెన్సీ స‌ర్టిఫికెట్ 2026 జులైలో వ‌స్తుంద‌న్నారు. 5,6,11వ బ్లాకుల‌ను 2026 జూన్‌లో హ్యాండోవ‌ర్ చేస్తామ‌ని.. దీనికి ఓసీ 2026 జులైలో వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. ఒక‌టి, రెండో బ్లాకుల‌ను 2026 జులైలో హ్యాండోవ‌ర్ చేస్తామ‌ని.. 2026 ఆగ‌స్టులో అంద‌జేస్తామ‌ని తెలిపారు. మూడు మ‌రియు 12వ‌ బ్లాకు‌ను 2026 అక్టోబ‌రులో హ్యాండోవ‌ర్ చేస్తామ‌ని.. 2026 న‌వంబ‌ర్‌లో బ‌య్య‌ర్ల‌కు ఇస్తామ‌న్నారు. తొమ్మిదో బ్లాకును 2026 డిసెంబ‌రులో హ్యాండోవ‌ర్ చేస్తామ‌ని.. 2027 ఫిబ్ర‌వ‌రిలో ఆక్యుపెన్సీ వ‌స్తుంద‌న్నారు. వివిధ కార‌ణాల వ‌ల్ల ఆల‌స్య‌మైన ఎనిమిదో బ్లాకును డిసెంబ‌రు 2027లో బ‌య్య‌ర్ల‌కు అంద‌జేస్తామ‌ని తెలిపారు. 

ప‌రిహారం చెల్లిస్తాం
టీజీ రెరా గ‌డువును దాటిన త‌ర్వాత కూడా డెలివ‌రీ ఆల‌స్య‌మైతే గ‌న‌క‌.. అందుకు త‌గ్గ న‌ష్ట‌ప‌రిహారం చెల్లిస్తామ‌ని వాస‌వి గ్రూప్ డైరెక్ట‌ర్ అభిషేక్ చందా తెలిపారు. ఫ్లాట్ల హ్యాండోవ‌ర్ ఆల‌స్య‌మైన నేప‌థ్యంలో.. గుడ్ విల్ సపోర్టు కింద 2025 సెప్టెంబ‌రు నుంచి ప్ర‌తి బ‌య్య‌ర్‌కు నెల‌కు ఏడు వేలు చొప్పున అంద‌జేస్తామ‌న్నారు. లీగ‌ల్ కేసు కార‌ణంగా ఎనిమిదో బ్లాకు ఆల‌స్యమైన నేప‌థ్యంలో.. ఇందులో కొన్న‌వారిని.. న‌యా పైసా అద‌నంగా తీసుకోకుండా.. వేరే బ్లాకులో అందుబాటులో ఉన్న ఫ్లాట్ల‌లో స‌ర్దుబాటు చేస్తామ‌న్నారు. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0