తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌పై ప్రముఖుల ప్రశంసలు..
Top national leaders and experts praised the Telangana Rising Document 2047 for its vision, transparency, and inclusiveness. Anand Mahindra called it a deeply insightful document created with public participation. Former RBI Governors Raghuram Rajan and Duvvuri Subbarao applauded Telangana’s rapid growth and stated that transforming the state economy from $250 billion to $3 trillion is achievable. Experts highlighted Telangana as Unstoppable and Unbeatable, setting a model for India’s future development.
తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ 2047ని భారతదేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రశంసించారు. ముందుగా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన విజన్ డాక్యుమెంట్ అద్భుతంగా ఉందని.. ఎంతో డెప్త్‌గా ఉందని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ఈ విజన్ డాక్యుమెంట్‌ను తెలంగాణ ప్రజలు, నిపుణులు రూపొందించినట్లుగా కనిపిస్తోందని అన్నారు. మాజీ గవర్నర్ రఘురామ రాజన్ మాట్లాడుతూ.. తెలంగాణ విజన్ డాక్యుమెంట్.. ట్రాన్స్‌పరెంట్, ఎఫెక్టీవ్, ఇన్ క్లూజివ్ గా ఉందన్నారు. ఇంప్లీమెంటేషన్‌పై ప్రభుత్వం దృష్టి సారించాలని విన్నవించారు. మరో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ 2047 కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందన్నారు. గత పదేళ్లలో తెలంగాణ మంచి ప్రగతిని సాధించిందని కితాబునిచ్చారు. దేశంలోనే అత్యధిక గ్రోత్ రేటును సాధించిందని ప్రశంసించారు. 250 బిలియన్ డాలర్ల తెలంగాణ ఎకానమీగా వచ్చే 22 ఏళ్లలో 3 ట్రిలియన్ డాలర్లుగా చేరడం కష్టమేం కాదని.. ప్రభుత్వం తలుచుకుంటే అది సాధ్యమవుతుందని అన్నారు. కోర్ కాంపిటెన్స్ పెంపొందించడంతో పాటు మాన్యుఫ్యాక్చరింగ్ రంగంపై దృష్టి సారించాలన్నారు. ఆయన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ అన్‌స్టాపబుల్ కాదని.. అన్‌బీటబుల్‌గా అభివర్ణించారు. భవిష్యత్తులో ప్రపంచం తెలంగాణ మోడల్‌గా అనుసరించాలని కోరారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0