ముప్ప‌య్యేళ్ల కృషి వ‌ల్లే ప్ర‌పంచ న‌గ‌రాల‌తో పోటీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Three decades of dedicated effort have enabled Hyderabad to compete with leading global cities

ముప్ప‌య్యేళ్ల కృషి వ‌ల్లే ప్ర‌పంచ న‌గ‌రాల‌తో పోటీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

1995 నుంచి 2025 వరకు 30 ఏళ్ల నిరంతర శ్రమ వల్లే హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడగలుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్ర‌వారం ఆయ‌న సుజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జర్మన్ టెక్నాలజీతో దక్షిణ భారత దేశంలోనే ఐవీ ఫ్లూయిడ్స్ తయారీలో గొప్ప సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమ‌ని ప్ర‌శంసించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో భాగంగా సుజెన్ మెడికేర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం సంతోషక‌ర‌మ‌ని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ పాలసీ డాక్యుమెంట్ ను విడుదల చేశామ‌ని.. క్యూర్, ప్యూర్, రేర్ మూడు భాగాలుగా తెలంగాణ అభివృద్ధి ఉంటుందని పేర్కొన్నారు. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమిగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ ఎకానమిగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌ని.. తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ క్యూర్, ప్యూర్ పై ఆధారపడి ఉంటుందని వివ‌రించారు. 

ప్రపంచంలోని గొప్ప నగరాలతో హైదరాబాద్, తెలంగాణ పోటీ పడుతోందని ఆనందం వ్య‌క్తం చేశారు. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూయార్క్ లతో తెలంగాణ పోటీ పడుతోందని.. అందులో భాగంగా యువ పారిశ్రామిక వేత్తలు ప్రారంభించే పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామ‌ని చెప్పారు. దేశంలో ఉత్పత్తి చేసే బల్క్ డ్రగ్స్ లో 40 శాతం తెలంగాణ నుంచి ఉత్పత్తి అవుతున్నాయని.. ప్రపంచమే మనవైపు చూసేలా ఫార్మా రంగంలో రాణిస్తున్నామ‌ని తెలిపారు. మనదగ్గర చదువుకుని వెళ్లిన వారు గ్లోబల్ కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారని.. ఇది తెలంగాణ‌కు ఎంతో గర్వకారణంగా అభివ‌ర్ణించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ‌ప‌డ్డారు. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0