టైర్-2 నగరాల్లో విక్రయాల జోష్

PropEquity report shows Tier-2 city home sales value up 4% in Q2 despite lower volumes, signaling a broader shift affecting Hyderabad real estate markets.

Dec 6, 2025 - 22:05
 0  6
టైర్-2 నగరాల్లో విక్రయాల జోష్
Tier-2 city home sales value

-      సెప్టెంబర్ త్రైమాసికంలో 4 శాతం పెరిగిన ఇళ్ల అమ్మకాలు

-      ప్రాప్ ఈక్విటీ నివేదిక వెల్లడి

దేశంలోని టైర్-2 నగరాల్లో ఇళ్ల విక్రయాలు పెరుగుతున్నాయ్. ఈ ఏడాది జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో దేశంలోని 15 ప్రధాన టైర్-2 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 4% పెరిగి రూ.37,409 కోట్లకు చేరినట్లు డేటా విశ్లేషణ సంస్థ ప్రాప్‌ఈక్విటీ తాజా నివేదిక వెల్లడించింది. సంఖ్యపరంగా 4 శాతం మేర తగ్గినా.. విలువపరంగా 4 శాతం మేర పెరిగిందని పేర్కొంది. ఈ త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు సంఖ్యాపరంగా 4% తగ్గి 39,201 యూనిట్లకు పరిమితమైనట్లు తెలిపింది. అలాగే కొత్త సరఫరా 10% క్షీణించి 28,721కు తగ్గినట్టు వెల్లడించింది. అహ్మదాబాద్‌సూరత్‌గాంధీ నగర్‌వడోదరజైపూర్‌నాసిక్‌నాగ్‌పూర్‌మొహాలిభువనేశ్వర్‌లక్నోభూపాల్‌కొయంబత్తూర్‌గోవా త్రివేండ్రంకొచ్చి... ఈ 15 నగరాల్లో అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ అహ్మదాబాద్‌లో వార్షిక ప్రాతిపదికన ఇళ్ల అమ్మకాలు 6% తగ్గి 13,021 యూనిట్లకు పరిమితమయ్యాయి. సూరత్‌లో విక్రయాలు 8% క్షీణించి 4,936 యూనిట్లకు తగ్గాయి. కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణఅమ్మకాల్లో 60% గుజరాత్‌లోని ప్రధాన నగరాలైన అహ్మదాబాద్‌సూరత్‌గాంధీ నగర్‌వడోదరల్లో నమోదయ్యాయి. భారత ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రధాన శక్తి కేంద్రాలుగా టైర్‌-2 నగరాలు ఎదుగుతున్నాయని ప్రాప్‌ఈక్విటీ ఫౌండర్‌సీఈఓ సమీర్‌ జసుజా తెలిపారు. ఉద్యోగ అవకాశాల విస్తరణమౌలిక సదుపాయాల అభివృద్ధిప్రాంతాల మధ్య మెరుగుతున్న అనుసంధానం(కనెక్టివిటీ) అంశాలు రియల్‌ ఎస్టేట్‌ విభాగాల్లో డిమాండ్‌ను పెంచుతున్నాయని పేర్కొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0