రెవెన్యూ మంత్రి తనయుడి కేసులో.. బాధితులకు హైకోర్టు పూర్తి రక్షణ
HC Orders Full Protection for Victims in Vatti Nagulapalli Land Dispute Involving Minister’s Son
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తనయుడు హర్షా తలదూర్చిన వట్టి నాగులపల్లి భూమి వివాదంలో.. తెలంగాణ హైకోర్టు బాధితులకు పూర్తి రక్షణను కల్పించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి మౌషుమి భట్టాచార్య శుక్రవారం తాజా తీర్పునిచ్చారు.
గత శనివారం అర్థరాత్రి రాజేంద్రనగర్ మండల పరిధిలోని వట్టి నాగులపల్లిలో సుమారు మూడు ఎకరాల ఒక ప్రైవేటు భూమిని మంత్రి తనయుడు కబ్జా చేసేందుకు యత్నించాడు. దాదాపు 70 మంది బౌన్సర్లతో వెళ్లి ప్రహారీని కూల్చివేశారు. తమపై హత్యా ప్రయత్నం చేశారని బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసులో పిటిషనర్లకు పూర్తి స్థాయి భద్రతను కల్పించాలని గచ్చిబౌలి సీఐకి న్యాయస్థానం ఆదేశాల్ని జారీ చేసింది. దిగువ కోర్టు జారీ చేసిన డాకెట్ ఆర్డర్‌ను రద్దు చేసి, కేసును పునఃపరిశీలించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.
పిటిషనర్ల తరఫున న్యాయవాది అపూర్వా రెడ్డి వాదించగా.. కేసును ఆధారాల ప్రకారం తిరిగి పరిశీలించాలని న్యాయమూర్తి ట్రయల్ కోర్టును ఆదేశించారు. సమాజంలో ఎంత పెద్ద వ్యక్తులైనా.. కోర్టు ఆదేశాల్ని ఉల్లంఘిస్తే కోర్టులు సహించవని ఈ తీర్పుతో నిరూపితమైంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0