భువ‌న‌తేజపై ఈడీ రైడ్

ED raids Bhuvanateja Infra over alleged ₹70 crore fund diversion. Probe focuses on Parijatha, Green Metro transactions as homebuyers hope to recover their money.

Dec 12, 2025 - 13:02
 0  24
భువ‌న‌తేజపై ఈడీ రైడ్
ED raids Bhuvanateja Infra over alleged ₹70 crore fund diversion.

* పారిజాత సంస్థ‌తో జ‌రిపిన
   లావాదేవీలు బ‌య‌టికొస్తాయా?
* గ్రీన్ మెట్రోపై ప్ర‌భావం?
* త‌మ సొమ్ము వెన‌క్కి వ‌స్తుంద‌నే
  ఆశ‌లో కొనుగోలుదారులు..


ప్రీలాంచ్ పేరిట కొనుగోలుదారుల నుంచి కోట్ల రూపాయ‌ల్ని వ‌సూలు చేసిన భువ‌న‌తేజ ఇన్‌ఫ్రాపై ఈడీ బుధ‌వారం రైడ్ చేసింది. ఈ సంస్థ సుమారు ఆరు లొకేష‌న్ల‌లో సుమారు డెబ్బ‌య్ కోట్ల దాకా నిధుల్ని గోల్‌మాల్ చేసింద‌ని అధికారులు భావిస్తున్న‌ట్లు స‌మాచారం. రేటు త‌క్కువ అంటూ అమాయ‌క ప్ర‌జ‌ల నుంచి సొమ్ము వ‌సూలు చేసి.. వాటిని ఇత‌ర కార్య‌క‌లాపాల‌కు వినియోగించార‌ని ఈడీకి తెలిసింది.

భువ‌న‌తేజ ఇన్‌ఫ్రా స‌కాలంలో ఫ్లాట్ల‌ను అంద‌జేయ‌క‌పోవ‌డంతో టీజీ రెరా ఈ సంస్థ‌పై సుమారు రూ.14.91 ల‌క్ష‌ల జ‌రిమానా విధించింది. బ‌య్య‌ర్ల నుంచి వ‌సూలు చేసిన సొమ్మును వెన‌క్కివ్వాల‌ని టీజీ రెరా ఆదేశించింది. ఆ స‌మ‌యంలోనే భువ‌న‌తేజ సంస్థ బండారం బ‌య‌టికి రావ‌డంతో ఈడీ ఈ కంపెనీ‌పై దృష్టి పెట్టింది. ఈ సంస్థ వ‌ద్ద పెట్టుబడి పెట్టిన కొనుగోలుదారుల జాబితా, నిధులు ఎలా వ‌చ్చాయి? ఆయా సొమ్మును ఎలా ఇత‌ర అవ‌స‌రాల‌కు మ‌ళ్లించారు వంటివ‌న్నీ ఈడీ ఆరా తీస్తోంది. సీజ్ చేసిన డాక్యుమెంట్లు, డిజిట‌ల్ రికార్డులు, లావాదేవీల వివ‌రాల‌పై ఈడీ క్షుణ్నంగా విశ్లేషిస్తుంద‌ని స‌మాచారం. ఇదే క్ర‌మంలో భువ‌న‌తేజ పారిజాత హోమ్స్‌, గ్రీన్ మెట్రో వంటి సంస్థ‌ల‌తో చేసిన లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివ‌రాలు బ‌య‌టికొచ్చే అవ‌కాశ‌ముంది. మొత్తానికి, ఈ సంస్థ కొనుగోలుదారులు నుంచి వ‌సూలు చేసే ప్ర‌తిపైసాను వారికి వెన‌క్కి ఇచ్చేలా ఈడీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని రియ‌ల్ నిపుణులు కోరుతున్నారు.  

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0