మ‌న న‌గ‌ర‌మిక‌.. మ‌హా హైద‌రాబాద్

Hyderabad is undergoing a massive transformation as GHMC expands from 650 sq. km to 2,735 sq. km with the merger of 27 municipalities and corporations. Rapidly urbanising regions like Shamshabad, Narsingi, and Medchal—located just outside the ORR—will now come under a unified development framework. The expansion aims to standardize urban planning, strengthen disaster management, ensure balanced growth, and attract major investments. GHMC divisions will increase from 150 to 400, and the annual budget is expected to cross ₹15,000 crore. After reorganisation, GHMC will be administered under four zones: East, West, North, and South.

Nov 29, 2025 - 21:46
Nov 29, 2025 - 21:47
 0  20
మ‌న న‌గ‌ర‌మిక‌.. మ‌హా హైద‌రాబాద్
Hyderabad is undergoing a massive transformation as GHMC expands

న‌గ‌ర ప‌రిధి ప్ర‌స్తుతం 650 చ‌. కి.మీ.
తాజాగా 2,735 కి.మీ.‌కు పెరుగుద‌ల‌

ప్ర‌స్తుతం డివిజ‌న్లు.. 150
అవి 400కు పెరుగుద‌ల


హైదరాబాద్ మహానగరం రూపురేఖలు మారిపోనున్నాయి. అతి పెద్ద మెట్రోపాలిటన్ సిటీగా అవతరించనుంది. జీహెచ్ఎంసీ ప‌రిధి ప్ర‌స్తుతం 650 చ‌ద‌ర‌పు మీట‌ర్లు ఉండ‌గా.. తాజాగా 27 మున్సిపాలిటీలు, కార్పొరేష‌న్ల విలీనంతో.. 2,735 కిలోమీట‌ర్ల‌కు పెరుగుతుంది. జీహెచ్‌ఎంసీలో విలీనం కానున్న మున్సిపాల్టీల్లో శంషాబాద్‌, నార్సింగి, మేడ్చల్‌ పరిధి ఓఆర్‌ఆర్‌ కు బయట 2 నుంచి 3 కిలమీటర్ల దూరం వరకు విస్తరించి ఉంది. ఇవి ఓఆర్‌ఆర్‌ గ్రోత్‌ కారిడార్‌ లో ఉండటంతో అక్కడ పట్టణీకరణ శరవేగంగా జరుగుతోంది. మిగతా ప్రాంతాల్లో ఇంత వేగంగా అభివృద్ది జరగడం లేదు. పైగా ఈ మున్సిపాల్టీలు, కార్పొరేష‌న్ల‌లు అభివృద్ధి, ప‌ట్ట‌ణ ప్ర‌ణాళిక‌ల‌న్నీ అస్త్య‌వ్య‌స్తంగా ఉన్నాయి. మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో ఒకే తరహా అభివృద్ధి ప్రణాళికను అమలు చేసేదిశగా ఈ విలీన నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధి ప్రణాళికలను రూపొందించడం, అస్త్య‌వ్య‌స్తంగా కాల‌నీల ఏర్పాటును నిలువ‌రించ‌డం, విపత్తుల నిర్వహణను సులభతరం చేయడం, అన్ని ప్రాంతాలకు పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు త‌యారు చేసేందుకు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

* జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం సుమారు కోటి మందికి పైగా జనాభా ఉంది. జీహెచ్ఎంసీ విస్తర ణ తర్వాత సిటీ జనాభా దాదాపు 2 కోట్లకు పెరగనుందని అధికారులు చెబుతున్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభాలో సగం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఉంటుంది. గ్రేటర్ సిటీ విస్తరణ కార‌ణంగా.. ప్ర‌స్తుత‌మున్న 150 డివిజ‌న్లు నాలుగు వంద‌ల‌కు పెరిగాయి. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్‌ రూ.8 వేల కోట్లు ఉంగా, విస్తరణ తర్వాత రూ.15 వేల కోట్లు దాటే అవకాశాలున్నాయి. ఇక ఔటర్ రింగ్ రోడ్డు వరకు జీహెచ్ఎంసీని విస్తరించిన తరువాత మొత్తం నాలుగు జోన్లుగా విభజిస్తార‌ని తెలుస్తోంది. జీహెచ్ఎంసీని ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ జోన్లుగా విభజించి పరిపాలనా సాగిస్తార‌ని అధికారిక వ‌ర్గాల సమాచారం. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. డివిజన్ల పునర్విభజన, కార్పొరేషన్ల విభజన ఒకటి రెండు నెలల్లో పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0