హైదరాబాద్ లో వీ వర్క్ భారీ లీజు

WeWork leases 1.75 lakh sq ft office space at Skyview 20, Hyderabad, and subleases it to JP Morgan. Major Grade-A office deal boosts Hyderabad real estate growth.

Dec 4, 2025 - 22:58
 0  13
హైదరాబాద్ లో వీ వర్క్ భారీ లీజు
wework-jp-morgan-hyderabad-skyview-20-office-lease-news

-      1.75 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్సేస్ అద్దెకు తీసుకున్న సంస్థ

-      జేపీ మోర్గాన్ కు లీజుకు ఇచ్చిన వీ వర్క్

హైదరాబాద్ లో భారీ ఆఫీస్ స్పేస్ లీజు ఒకటి నమోదైంది. హైటెక్ సిటీలోని గ్రేడ్-ఎ టెక్ పాక్క్ స్కై వ్యూ 20లో వీ వర్క్ ఇండియా 1.75 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని ఐదేళ్ల కాలానికి లీజుకు తీసుకుంది. నెలవారీ రూ.1.72 కోట్ల ప్రారంభ అద్దెతో ఒప్పందం చేసుకున్న వీ వర్క్.. అనంతరం మొత్తం రెండంతస్తుల స్థలాన్ని జేపీ మోర్గాన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు 60 నెలల కాలానికి రూ.4.38 కోట్ల నెలవారీ అద్దెకు ఇచ్చినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సీఆర్ఈ మ్యాట్రిక్స్ వెల్లడించింది. తొలుత లీజు ఒప్పందం మహంగా కమర్షియల్ ప్రాపర్టీస్, వీ వర్క్ మధ్య జరగ్గా.. సబ్ లీజు ఒప్పందం వీ వర్క్, జేపీ మోర్గాన్ మధ్య జరిగింది. ఈ రెండు ఒప్పందాలూ గతనెలలో నమోదయ్యాయి. నవంబర్ 7న నమోదైన మొదటి లావాదేవీలో వీ వర్క్, మహంగగా కమర్షియల్ ప్రాపర్టీస్ మధ్య తొలి ఒప్పందం జరిగింది. చదరపు అడుగుకు రూ.98 చొప్పున నెలకు రూ.1.72 కోట్ల ప్రారంభ అద్దెతో లీజు డీడ్ పై సంతకాలు చేశారు.  ఇందుకోసం రూ.10.3 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ ను వీ వర్క్ చెల్లించింది. అనంతరం నవంబర్ 13న వీ వర్క్, జేపే మోర్గాన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తో జనరల్ సర్వీస్ అగ్రిమెంట్ (సబ్ లీజు) కుదిరింది. మొత్తం 1.75 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని చదరపు అడుగుకు రూ.249 చొప్పున నెలవారీ ప్రారంభ అద్దె రూ.4.38 కోట్లకు జేపీ మోర్గాన్ కు లీజుకు ఇచ్చింది. ఇందుకోసం ఫిట్ అవుట్ లు, ఎమినిటీస్, వర్క్ స్పేస్ డిజైన్ ను జోడించి దానిని ప్రీమియం స్పేస్ గా వీ వర్క్ మార్చింది. హైటెక్ సిటీలోని స్కైవ్యూ 20లో ఐదు, ఆరు అంతస్తుల్లో ఈ స్పేస్ ఉంది. ఇందుకోసం జేపీ మోర్గాన్ రూ.25.9 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించింది. ఈ కార్యాలయంలో 176 కార్ పార్కింగ్‌లు ఉన్నాయి. హైటెక్ సిటీ మెయిన్ రోడ్‌లో ఉన్న స్కైవ్యూ 20 హైదరాబాద్‌లోని గ్రేడ్-ఎ టెక్ పార్క్ అయిన పెద్ద స్కైవ్యూ క్యాంపస్‌లో భాగంగా అభివృద్ధి చేశారు. ప్రధాన క్యాంపస్‌లకు సమీపంలో ఉండటంమెట్రో కనెక్టివిటీ, అధిక సాంద్రత కలిగిన వర్క్ స్పేస్ పార్కులకు ప్రాధాన్యత పెరగడం వల్ల ఇక్కడ ఆఫీస్ స్పేస్ కు డిమాండ్ అధికంగా ఉంది. కాగా, ఈ సంవత్సరం ప్రారంభంలో జేపీ మోర్గాన్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో జపనీస్ సంస్థ సుమిటోమో రియాల్టీ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ అనుబంధ సంస్థ అయిన గోయిసు రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేస్తున్న వాణిజ్య టవర్‌లో 1.16 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని రూ.6.91 కోట్ల నెలవారీ అద్దెకు ప్రీ-లీజుకు తీసుకున్నట్లు ప్రాప్‌స్టాక్ పేర్కొంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0