2.6 ఎకరాలకు రూ.2,251 కోట్ల బిడ్
Mumbai’s Mahalaxmi railway land lease sets a record with a ₹2,251 crore bid for 2.6 acres. RLDA plans ₹8,000 crore via land monetisation across Mumbai.
- రైల్వే డెవలప్ మెంట్ అథార్టీ భూమి లీజుకు భారీ డిమాండ్
ముంబై మహాలక్ష్మి ప్రాంతంలోని 2.6 ఎకరాల భూమి లీజు రికార్డు సృష్టించింది. ఈ భూమికి ఏకంగా రూ.2,251 కోట్ల బిడ్ వచ్చింది. దక్షిణ ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో ఉన్న కీలకమైన 2.6 ఎకరాల భూమిని 99 ఏళ్లపాటు దీర్ఘకాలిక లీజుకు ఇవ్వనున్నట్టు రైల్వే ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఆర్ఎల్ డీఏ) సెప్టెంబర్‌లో ప్రకటించింది.
10,801.7 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమిని వాణిజ్యపరంగా వినియోగించుకోవాలని ఆర్ఎల్ డీఏ నిర్ణయించి ఆ మేరకు ప్రకటన జారీ చేసింది. రిజర్వు ధరను రూ.వెయ్యి కోట్లుగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 99 ఏళ్ల లీజుకు రికార్డు స్థాయిలో రూ.2,251 కోట్ల బిడ్ లభించింది. ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో 2.6 ఎకరాల ప్లాట్‌కు ఇంతవరకు వచ్చిన అత్యధిక ధర ఇదే. బిడ్లు సమర్పించిన ఇతర కంపెనీలలో శోభా రియల్టీ, లోధా గ్రూప్, ఆర్‌ఎంజెడ్ గ్రూప్ వంటివి కూడా ఉన్నాయి. అత్యధిక బిడ్ వేసిన వారికి రాబోయే 10 రోజుల్లో అంగీకార పత్రం అందుతుంది. అనంతరం సదరు బిడ్డర్ ప్రణాళికలను పరిశీలించిన తర్వాత రైల్వే ఆమోదం తెలుపుతుంది. కాగా, భారతీయ రైల్వే తన భూ అభివృద్ధి విభాగమైన రైల్ ల్యాండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్‌లోని కీలకమైన భూములను లీజుకు ఇవ్వడం ద్వారా కనీసం రూ.8,000 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఆర్‌ఎల్‌డిఏ ఆర్థిక రాజధానిలోని నాలుగు ప్రధాన ప్రదేశాల్లో విస్తరించి ఉన్న సుమారు 25 ఎకరాల భూమిని లీజుకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ముంబైలోని బాంద్రా వెస్ట్ లో ఉన్న ఐదు ఎకరాల ఆర్‌ఎల్‌డిఏ ప్లాట్ కూడా ఉంది. ఇందులో ప్రస్తుతం 1955 నాటి రైల్వే సిబ్బంది క్వార్టర్లు ఉన్నాయి. దీని తర్వాత బాంద్రా ఈస్ట్ లో ఒక ప్లాట్, సెంట్రల్ ముంబైలోని పరేల్‌లో మరో ప్లాట్ ఉన్నాయి. కాగా, 2025లో నారిమన్ పాయింట్‌లో ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఆర్‌సీఎల్) నుంచి 4.16 ఎకరాల భూమిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.3,472 కోట్లకు కొనుగోలు చేసింది. విలువ పరంగా జరిగిన అతిపెద్ద భూ ఒప్పందాలలో ఇది ఒకటిగా నిలిచింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0