6 నెలలు.. 28 సంస్థలు.. రూ.92,500 కోట్లు..
India’s top 28 listed real estate companies recorded ₹92,500 crore sales in six months, led by Prestige, DLF and Godrej. Expert outlook indicates ₹2 lakh crore sales this year.
- ప్రాపర్టీ అమ్మకాల్లో లిస్టెడ్ కంపెనీల జోరు
- టాప్ లో ప్రెస్టీజ్ గ్రూప్
దేశంలోని లిస్టెడ్ రియల్టీ సంస్థలు ప్రాపర్టీ అమ్మకాల్లో జోరు ప్రదర్శిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో టాప్ 28 సంస్థలు రూ.92,500 కోట్ల విలువైన ప్రాపర్టీలను విక్రయించాయి. బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ అత్యధిక అమ్మకాలతో టాప్ లో ఉంది. ఆరు నెలల్లో ఈ సంస్థ 18,143.7 కోట్ల ప్రీ-సేల్స్ తో ప్రముఖ లిస్టెడ్ ప్లేయర్‌గా అవతరించింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా దేశంలో అతిపెద్ద రియల్టీ సంస్థ అయిన డీఎల్ఎఫ్ లిమిటెడ్ రూ.15,757 కోట్ల ప్రీ-సేల్స్ తో రెండవ స్థానంలో నిలిచింది. ముంబైకి చెందిన గోద్రేజ్ ప్రాపర్టీస్ రూ.15,587 కోట్ల అమ్మకాల బుకింగ్‌లను నమోదు చేయగా, లోధా డెవలపర్స్ రూ.9,020 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించింది. ఢిల్లీకి చెందిన సిగ్నేచర్ గ్లోబల్ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో రూ.4,650 కోట్ల అమ్మకాల బుకింగ్‌లను సాధించింది. ఈ ఐదు సంస్థలు కలిసి మొత్తం రూ.63వేల కోట్ల అమ్మకాలు జరిపాయి. టాప్ 28 సంస్థల్లో ఈ ఐదు సంస్థల వాటా 70 శాతం కావడం విశేషం.
కోవిడ్ తర్వాత లిస్టెడ్ రియల్ ఎస్టేట్ డెవలపర్లకు డిమాండ్ బాగా పెరిగింద. దీంతో ఆయా కంపెనీల రెసిడెన్షియల్ ప్రాజెక్టులు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మరోవైపు కొనుగోలుదారులు రిస్కు తీసుకోవడానికి ఇష్టపడటంలేదు. మంచి ట్రాక్ రికార్డు కలిగిన పెద్ద బ్రాండెడ్ రియల్టర్ల వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇక ఇతర ఇతర లిస్టెడ్ ప్లేయర్లలో బెంగళూరుకు చెందిన శోభా లిమిటెడ్ రూ.3,981.4 కోట్లు, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్ రూ.3,152 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించాయి. ముంబైకి చెందిన ఒబెరాయ్ రియాల్టీ లిమిటెడ్ రూ.2,937.74 కోట్లు, కల్పతరు లిమిటెడ్ రూ.2,577 కోట్ల అమ్మకాల బుకింగ్‌లను నమోదు చేశాయి. బెంగళూరుకు చెందిన పుర్వాంకర రూ.2,455 కోట్ల ప్రీ-సేల్స్ సాధించింది. రుస్తోంజీ బ్రాండ్ కింద మార్కెట్ చేసే ముంబైకి చెందిన కీస్టోన్ రియల్టర్స్ అమ్మకాల బుకింగ్‌లు రూ.1,839 కోట్లుగా ఉన్నాయి. ముంబైకి చెందిన సన్‌టెక్ రియాల్టీ రూ.1,359 కోట్లు, ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్ రూ.1,312 కోట్ల అమ్మకాల బుకింగ్‌లను సాధించాయి. పూణేకు చెందిన కోల్టే-పాటిల్ డెవలపర్స్ లిమిటెడ్ రూ.1,286 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించగా, ముంబైకి చెందిన మహీంద్రా లైఫ్‌స్పేస్ డెవలపర్స్ లిమిటెడ్ రూ.1,200 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించింది. బెంగళూరుకు చెందిన శ్రీరామ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ రూ.1,126 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించింది.
రూ.1,000 కోట్ల కంటే తక్కువ విలువైన ప్రీ-సేల్స్ విభాగంలో చాలా కంపెనీలు ఉన్నాయి. కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 26 ప్రధాన లిస్టెడ్ రియల్ ఎస్టేట్ సంస్థలు రూ.1.62 లక్షల కోట్ల విలువైన ఆస్తులను విక్రయించాయి. గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.30,000 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడం ద్వారా అతిపెద్ద అమ్మకందారుగా నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలోనే 28 సంస్థలు రూ.92,500 కోట్ల అమ్మకాలు జరిపిన నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం కంటే అధికంగా ఈసారి ప్రాపర్టీల అమ్మకాలు రూ.2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0