జీహెచ్ఎంసీలో కొత్త‌గా 12 జోన్లు.. అర‌వై స‌ర్కిళ్లు..

Telangana govt restructures GHMC into 12 zones and 60 circles under GO 292 to improve governance, a move expected to impact Hyderabad real estate and growth.

జీహెచ్ఎంసీలో కొత్త‌గా 12 జోన్లు.. అర‌వై స‌ర్కిళ్లు..
ghmc-new-zones-12-zones-60-circles-hyderabad-real-estate-impact
తెలంగాణ ప్ర‌భుత్వం ఒక కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ను 12 జోన్లు, అర‌వై స‌ర్కిళ్లుగా విభ‌జిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం జీవో నెంబ‌ర్ 292ను తాజాగా విడుద‌ల చేసింది. ఇటీవ‌ల ప్ర‌భుత్వం ఇర‌వై మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేష‌న్ల‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. దీంతో, గ్రేట‌ర్ హైద‌రాబాద్ జ‌నాభా సుమారు కోటీ ముప్ప‌య్ నాలుగు ల‌క్ష‌లు దాటేసింది. జీహెచ్ఎంసీ ప‌రిపాల‌న స‌జావుగా సాగ‌డంతో పాటు మెరుగైన సేవ‌ల్ని అందించేందుకు గ‌తంలో ఉన్న ఆరు జోన్ల‌ను కాస్త ప‌న్నెండు జోన్లుగా మార్చింది. ఇందులో మూడు వంద‌ల వార్డుల‌ను చేర్చుతూ నిర్ణ‌యం తీసుకుంది. మ‌ల్కాజ‌గిరి, ఉప్ప‌ల్‌, ఎల్‌బీన‌గ‌ర్‌, శంషాబాద్‌, రాజేంద్ర‌న‌గ‌ర్‌, ఛార్మినార్‌, గోల్కొండ, ఖైర‌తాబాద్‌, సికింద్రాబాద్‌, శేరిలింగంప‌ల్లి, కూక‌ట్‌ప‌ల్లి, కుత్బుల్లాపూర్ వంటి వాటిని జోన్లుగా చేశారు. వీటి ప‌రిధిలోకి అర‌వై స‌ర్కిళ్లుగా విభ‌జించారు. 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0