కో లివింగ్‌.. ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రెండింగ్‌

Co-living investment is emerging as a high-return rental trend. Know why Hyderabad real estate investors prefer co-living hostels for better yields.

Dec 20, 2025 - 07:53
 0  22
కో లివింగ్‌.. ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రెండింగ్‌
co-living-investment-trend-hyderabad-real-estate

కో లివింగ్‌ హాస్టళ్లకు పెరుగుతున్న డిమాండ్‌

 

దేశంలో కో లివింగ్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. ఇప్పటివరకు అభివృద్ధి చెందిన పెద్ద నగరాలకే పరిమితమైన ఈ రెంటల్‌ హౌసింగ్‌ విధానం ఇపుడు టైర్‌-2 నగరాల్లోనూ పెరుగుతోంది. హైదరాబాద్‌తో పాటు విజయవాడతిరుపతివిశాఖపట్నం వంటి నగరాల్లో వీటికి డిమాండ్‌ ఊపందుకుంటోంది. 

నాస్కామ్ తాజా నివేదిక ప్రకారం విశాఖపట్నంతిరుపతివిజయవాడ వంటి నగరాలు కొత్త టెక్నాలజీఎడ్యుకేషన్ హబ్‌లుగా ఎదుగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాలకు యువ ప్రొఫెషనల్స్విద్యార్థులు బాగా వస్తున్నారు. సౌకర్యవంతంగా ఉంటూనేతక్కువ అద్దెకు లభించే వసతి సదుపాయాల కోసం వారు వెతుక్కుంటున్నారు. ఫలితంగా... అలాంటి సౌకర్యాలను అందిస్తున్న కో-లివింగ్ ప్రాజెక్టులకు ఆదరణ పెరుగుతోంది. సింగిల్ బెడ్రూమ్ అద్దెకన్నా సుమారు 35 శాతం చౌకగాసరళతరమైన నిబంధనలతో లీజుకు తీసుకునేందుకు వీలుగా ఉండటంతో పాటు వై-ఫైక్లీనింగ్కమ్యూనిటీ కార్యక్రమాల్లాంటి హంగులెన్నో ఉంటుండటంతో జెన్ జెడ్ వీటివైపు మొగ్గు చూపుతోంది. 

హైదరాబాద్‌లో సాధారణ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అద్దె నెలకు రూ.25,000 ఉందనుకుంటేఆ ఇంటినే కో-లివింగ్ కింద (మూడు వేర్వేరు గదులుగా) మారిస్తే రూ. 30,000- రూ.40,000 వరకు వస్తోంది. సంప్రదాయ రెంటల్ విధానమైతే పెట్టుబడిపై వార్షికంగా సుమారు 2 నుంచి 3 శాతం మేర నికరంగా రాబడి లభిస్తుంటే... ఈ కో-లివింగ్ విధానంలో 5 నుంచి 7 శాతం రాబడి వస్తోంది. అదే ఎడ్యుకేషన్‌టెక్నాలజీ సెంటర్లకు దగ్గర్లో ఉన్నవైతే కొన్ని సందర్భాల్లో 8 శాతం వరకు రాబడి ఉంటోంది. పైగా ఇలాంటి ప్రాపర్టీలను కో-లివింగ్‌ తరహాలో అద్దెకు ఇవ్వాలనుకునే యజమానుల తరఫున అన్ని పనులూ చూసుకునే నిర్వహణ ఏజెన్సీలు కూడా చాలా వస్తున్నాయి. దీంతో స్మార్ట్‌ ఇన్వెస్టర్లు కూడా ఈ కో లివింగ్‌ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0