హైదరాబాద్‌లో ఇళ్లు కట్టేందుకు కొత్తగా 9,292 ఎకరాల భూమి
The Telangana government will release 9,292 acres of industrial land inside Hyderabad’s ORR for housing, IT and commercial use under the HILT policy.
హైదరాబాద్లో భారీ ఎత్తున భూములు అందుబాటులోకి వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపల నగరం నడిబొడ్డున సుమారు 9వేల ఎకరాల భూములు నిర్మాణాలకు అనువుగా మారనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు లోపల నిరుపయోగంగా ఉన్న పారిశ్రామిక భూములు, కాలుష్య కారక పరిశ్రమలను తరలిస్తే.. ఖాళీగా ఉండే భూముల విషయంలో ఇటీవల హిల్ట్ అనే పాలసీని తీసుకొచ్చింది. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచి అవకాశం అని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
ఔటర్ రింగ్ రోడ్ లోపల, సమీపంలో ఉన్న 9,292 ఎకరాల పాత ఇండస్ట్రియల్ ల్యాండ్ ను రెసిడెన్షియల్, కమర్షియల్, ఐటీ, మల్టీ-యూజ్ జోన్ లుగా మార్చేందుకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ అవకాశం కల్పిస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలోని అజామాబాద్ సహా నాచారం ఐడీఏ, మల్లాపూర్, చర్లపల్లి, కూకట్‌పల్లి, జీడిమెట్ల, బాలానగర్, సనత్‌నగర్, పటాన్‌చెరు, కాటేదాన్, హయత్‌నగర్, చందూలాల్ బారాదరి తదితర ప్రముఖ పారిశ్రామిక ఏరియాలు ఈ కొత్త జోన్ పరిధిలోకి వస్తున్నాయి. గతంలో ఈ భూములు కేవలం పారిశ్రామిక అవసరాలకే పరిమితమై ఉంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ డెవలపర్లకు భారీ అవకాశం లభించనుంది.
సుమారు 9,292 ఎకరాల పారిశ్రామిక భూమిని మల్టీ యూజ్ జోన్స్ గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఇందులో 4,740 ఎకరాల ప్లాటెడ్ ఏరియా కూడా ఉంది. ఇకపై ఈ భూముల్లో రెసిడెన్షియల్ ఫ్లాట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, షాపింగ్ మాల్స్ లాంటివి కూడా నిర్మించుకోవచ్చు. ఈ నిర్ణయంతో నగరంలోని భూమి వినియోగం పెద్ద మలుపు తిరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ పాలసీ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు గేమ్-చేంజర్ గా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఏళ్ల తరబడి ఉన్న పాత ఇండస్ట్రియల్ ఏరియాలు కొత్త రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు మారతాయి. కొత్త లాంచెస్ పెరుగుతాయి. దీని వల్ల ఇళ్ల ధరలు అందుబాటులోకి వస్తాయి. ఈ పాలసీతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2025-26లో బలంగా రికవర్ అవుతుందని భావిస్తున్నారు. మధ్యతరగతి హౌసింగ్ కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ కు తగ్గ సరఫరా మాత్రం లేదు. హిల్ట్ పాలసీతో అది తీరితే హైదరాబాద్ మరింత అఫర్డబుల్‌గా మారుతుంది.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల 9,292 ఎకరాల భూమి నివాస, వాణిజ్య నిర్మాణాలకు అందుబాటులోకి రానుండటంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీ రెవెన్యూతో పాటు రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఇళ్ల ధరలను తగ్గించేందుకు అవకాశం ఏర్పడుతుందని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ భూములను అపార్ట్ మెంట్లు, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ల నిర్మాణం కోసం వినియోగించవచ్చని, కార్యాలయాల ఏర్పాటు, హోటళ్లు, స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటళ్లు, రిసెర్చ్ సెంటర్ల నిర్మాణానికీ వాడుకోవచ్చని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. పార్కులు, స్పోర్ట్స్, కల్చరల్ సెంటర్లు, టెక్నాలజీ పార్కులు, క్యాంపస్ లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చని వివరించింది. ఈ భూమిని అభివృద్ధి చేసేందుకు రిజిస్ట్రేషన్ విలువలో 30 శాతం చెల్లించాలని ఆదేశించింది. 80 ఫీట్ల కంటే తక్కువ వెడల్పు గల రోడ్లు ఉన్న ప్లాట్స్‌కు 30 శాతం, 80 ఫీట్ల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న ప్లాట్లకు 50 శాతం చెల్లించాలని పేర్కొంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0