హైదరాబాద్.. అత్యంత సరసమైన మార్కెట్

Colliers report finds Hyderabad real estate among the most affordable Tier-1 markets, with strong income growth and improving home affordability ratios.

Dec 6, 2025 - 22:15
 0  7
హైదరాబాద్.. అత్యంత సరసమైన మార్కెట్
Colliers report finds Hyderabad real estate among the most affordable

-      అహ్మదాబాద్ కూడా అందుబాటు గృహ మార్కెట్

-      కొలియర్స్ నివేదిక వెల్లడి

దేశంలో అత్యంత సరసమైన గృహ మార్కెట్లలో మన హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ధర-ఆదాయ నిష్పత్తులు మెరుగుపడటంతో హైదరాబాద్ తోపాటు అహ్మదాబాద్ దేశంలోని టైర్-1 నగరాల్లో అత్యంత సరసమైన రియల్ ఎస్టేట్ మార్కెట్లుగా అవతరించినట్టు కొలియర్స్ తాజా నివేదిక వెల్లడించింది. స్థిరమైన డిమాండ్అనుకూలమైన వడ్డీ రేట్లు, పెరుగుతున్న ఆదాయాల కారణంగా దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు అమ్మకాలు బలంగా ఉన్నాయని తెలిపింది. గత 15 సంవత్సరాలుగా అధిక ఆదాయాలుమితమైన ధరల పెరుగుదల, మెరుగైన క్రెడిట్ యాక్సెస్ ద్వారా చాలా టైర్- నగరాల్లో గృహాల స్థోమత మెరుగుపడిందని.. ధర-ఆదాయం నిష్పత్తి 2010లో 88.5 శాతం ఉండగా.. 2025లో 45.3కి మెరుగుపడిందని వివరించింది. అహ్మదాబాద్, హైదరాబాద్ వంటి నగరాలు దేశంలో అత్యంత సరసమైన నివాస మార్కెట్లలో కొన్నిగా అవతరించాయని.. అహ్మదాబాద్‌లో ధర-ఆదాయం నిష్పత్తి 2010లో 43.6 ఉండగా.. 2025లో 19.8కి మెరుగుపడిందని తెలిపింది. అలాగే హైదరాబాద్‌లో అది 25.6 నుంచి 16.3కి మెరుగుపడిందని వెల్లడించింది. బెంగళూరులో ఇది 44.2 నుంచి 20.9కిఢిల్లీ-ఎన్ సీఆర్ లో 63.8 నుంచి 27.8కి మెరుగుపడింది. వాస్తవానికి నిర్మాణ రంగ మెటీరియ్స్ ధరలు పెరుగుతున్నప్పటికీ, ఆదాయ వృద్ధి చాలా మార్కెట్లలో ప్రాపర్టీ ధరల పెరుగుదలను అధిగమించింది. 2010 నుంచి భారతదేశంలో సగటు ఆదాయాలు నాలుగు రెట్లు ఎక్కువ పెరిగాయి. మరోవైపు గత 15 సంవత్సరాలలో అత్యుత్తమ గృహ రుణాలు 10 రెట్లు పెరిగాయి2010లో రూ.3 లక్షల కోట్ల నుంచి 2025లో రూ.30 లక్షల కోట్లకు పెరిగాయి.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0