జీహెచ్ఎంసీ పరిధిలో పది అంతస్తులు దాటితే హెచ్ఎండీఏ పర్మిషన్?
జీహెచ్ఎంసీ పరిధిలో పది అంతస్తులు దాటితే హెచ్ఎండీఏ పర్మిషన్?
భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకున్నదని సమాచారం. ఇక నుంచి హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ అయినా హెచ్ఎండీఏ పరిధి అయినా.. పది అంతస్తులు దాటిన తర్వాత.. నిర్మాణ సంస్థలు కట్టే బహుళ అంతస్తుల భవనాలకు.. అనుమతుల్ని హెచ్ఎండీఏ జారీ చేస్తుందట. ఈ మేరకు పురపాలక శాఖ కొద్ది రోజుల్లో ఉత్తర్వ్యులు జారీ చేసే అవకాశముందని తెలిసింది. ఇప్పటివరకూ జీహెచ్ఎంసీ పరిధిలో జీహెచ్ఎంసీ కమిషనర్ అనుమతుల్ని మంజూరు చేసేవారు. కాకపోతే, ఇక నుంచి అతని బదులు హెచ్ఎండీయే కమిషనర్ ద్వారా పది అంతస్తులు దాటే భవనాలకు అనుమతుల్ని జారీ చేస్తారట. అంటే బహుళ అంతస్తుల భవనాలు, ఆకాశహర్మ్యాలకు అనుమతుల్ని మంజూరు చేసే అవకాశాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ కోల్పోతారన్నమాట. అదేవిధంగా, జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇక నుంచి పది అంతస్తుల్లోపు భవనాలకు మాత్రమే అనుమతిని మంజూరు చేయాల్సి ఉంటుంది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0