గ్రేటర్ నిర్మాణ రంగంలో మేడ్చల్ జిల్లా హవా..

Medchal-Malkajgiri leads Hyderabad real estate growth with 45% registrations. Strong residential demand, IT expansion, and suburban boom drive 2025 surge.

Dec 19, 2025 - 06:24
 0  7
గ్రేటర్ నిర్మాణ రంగంలో మేడ్చల్ జిల్లా హవా..
medchal-malkajgiri-dominates-hyderabad-real-estate-growth-2025

హైదరాబాద్లో ఇళ్ల అమ్మకాల్లో క్రమంగా వృద్ది కనిపిస్తోంది. అంతకంతకు పెరుగుతున్న స్థిరాస్తుల రిజిస్ట్రేష‌న్లే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇక గ్రేటర్ హైదరాబాద్లో  మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా, కష్మన్ & వేక్‌ ఫీల్డ్ నివేదికల ప్రకారం హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో జరిగే రిజిస్ట్రేషన్లలో మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా 39 నుంచి 45 శాతం వాటాను కలిగి ఉంది. సబర్బన్ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ డిమాండ్ భారీగా పెరగడం, కొంపల్లి వంటి ప్రాంతాల్లో రిటైల్ లీజింగ్ బూమ్ ఈ వృద్ధికి ప్రధాన కారణాలని నైట్ ఫ్రాంక్ పేర్కొంది.

హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ 2025లో స్థిరంగా బలోపేతమవుతోంది. ఈ అక్టోబర్ నెలలో గ్రేటర్ హైదరాబాద్ లో 6,194 ఇళ్లు రిజిస్టర్ అయ్యాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 5 శాతం పెరుగుదల అని చెప్పొచ్చు. ఈ ఇళ్ల మొత్తం విలువ రూ.4,512 కోట్లకు చేరగా.. 25 శాతం వృద్ధిగా నమోదైంది. గ్రేటర్ సిటీలో జనవరి నుంచి అక్టోబర్ వరకు మొత్తం 61,699 యూనిట్లు రిజిస్టర్ అయ్యాయి. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా సబర్బన్ ప్రాంతాలైన కొంపల్లి, మేడ్చల్, షామీర్‌పేట్, దుండిగల్ వంటి ప్రాంతాల్లో రెసిడెన్షియల్ డిమాండ్‌ కు కేంద్రంగా మారాయి.

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, అపార్ట్‌ మెంట్లకు భారీ డిమాండ్ ఉంది. ఐటీ, ఫార్మా సెక్టార్ల విస్తరణ , గేట్‌వే ఐటీ పార్క్ కండ్లకోయ, జీనోమ్ వ్యాలీ 3.0 ఎక్స్‌టెన్షన్ వల్ల ఉద్యోగాలు పెరిగి, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ముందు ముందు కూడా మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌ రంగంలో కీలక పాత్ర పోషిస్తుందని నైట్ ఫ్రాంక్ అభిప్రాయపడింది. ఇన్‌ఫ్రా అభివృద్ధి, ఐటీ విస్తరణ వల్ల 2026లో మరింత వృద్ధి జరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0