ఐదు ఆఫీస్ యూనిట్లు.. రూ.20 కోట్లు
Bollywood filmmaker Rakesh Roshan and his wife Pramila Roshan have expanded their real estate portfolio by purchasing five commercial office units worth ₹19.68 crore in Mumbai’s Andheri. The new acquisition includes 7,500 sq ft RERA carpet area and 10 parking slots. A detailed breakdown of unit sizes, prices, and stamp duty paid highlights the growing trend of celebrity investments in premium commercial real estate.
- ముంబైలో కొన్న రాకేష్ రోషన్ దంపతులు
బాలీవుడ్ దర్శక నిర్మాత, హీరో హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ ముంబైలో తన రియల్ పోర్ట్ ఫోలియో విస్తరణ పరంపర కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దేశ ఆర్థిక రాజధానిలో పలు ప్రాపర్టీలు కలిగి ఉన్న ఆయన.. తాజాగా భార్య ప్రమీలా రోషన్ తో కలిసి అంధేరిలో ఐదు ఆఫీస్ యూనిట్లను రూ.19.68 కోట్లకు కొనుగోలు చేశారు.
వైద్య వెస్ట్ వరల్డ్ వన్ ఏరోపొలిస్ అనే భవనంలో ఉన్న ఈ వాణిజ్య ప్రాపర్టీలను వైద్య స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వారు కొనుగోలు చేసినట్టు రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా తెలుస్తోంది. ఈ ఐదు యూనిట్లూ ఆ భవనంలోని ఎనిమిదో అంతస్తులో ఉన్నాయి. ఈ ఐదు యూనిట్లలో మొదటి ప్రాపర్టీ విలువ రూ. 3.27 కోట్లు. ఇది 1,259 చదరపు అడుగుల రెరా కార్పెట్ ఏరియాను కలిగి ఉంది. దీంతోపాటు రెండు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఈ లావాదేవీకి రూ. 19.64 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారు. ఇక రెండో యూనిట్ విలువ రూ. 2.83 కోట్లు. దీనికి 1,089 చదరపు అడుగుల రెరా కార్పెట్ ప్రాంతం ఉంది. దీనికి కూడా రెండు కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఈ లావాదేవీకి రూ. 16.98 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారు. ఇవి రెండూ రాకేష్ రోషన్ పేరు మీద కొనుగోలు చేయగా.. మిగిలిన మూడు యూనిట్లను ఆయన భార్య పేరు మీద కొన్నారు. ఇందులో మొదటి యూనిట్ విలువ రూ. 4.85 కోట్లు. దీనికి 1,869 చదరపు అడుగుల రెరా కార్పెట్ ప్రాంతం ఉంది. ఈ ఒప్పందంలో కార్ల కోసం రెండు పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఈ లావాదేవీకి రూ. 29.15 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారు.
ప్రమీలా రోషన్ కొనుగోలు చేసిన రెండో ప్రాపర్టీ విలువ రూ. 5.28 కోట్లు. దీనికి 2,033 చదరపు అడుగుల రెరా కార్పెట్ ఏరియా ఉంది. ఇందులో కూడా రెండు కార్ పార్కింగ్ స్లాట్లు ఉన్నాయి. ఈ లావాదేవీలో రూ. 31.71 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారు. అలాగే మూడో యూనిట్ విలువ రూ. 3.43 కోట్లు. దీనికి 1,322 చదరపు అడుగుల రెరా కార్పెట్ ఏరియా ఉంది. దీనికి కూడా రెండు కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఈ లావాదేవీలో రూ. 20.62 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్నాయి. మొత్తానికి ఐదు ఆఫీస్ యూనిట్లు కలిపి 7,500 చదరపు అడుగుల రెరా కార్పెట్‌తో పాటు 10 కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. మొత్తం రూ.లక్షన్నర రిజిస్ట్రేషన్ ఫీజు కింద, రూ.1.18 కోట్లను స్టాంపు డ్యూటీ కింద చెల్లించారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0