ఆఫీస్ స్పేస్ కొన్న కార్తీక్ ఆర్యన్
Kartik Aaryan’s parents buy a premium office space in Mumbai’s JVPD for ₹10.83 crore. Earlier, Kartik also invested in Andheri West and Alibaug properties.
నటుడు కార్తీక్ ఆర్యన్ కుటుంబం తమ రియల్ ఎస్టేట్ పోర్ట్ ఫోలియోను విస్తరించింది. కార్తీక్ ఆర్యన్ తల్లిదండ్రులు మాలా తివారీ, మనీష్ తివారీ ముంబై జేవీపీడీ ప్రాంతంలో ఉన్న నోటన్ హౌస్‌లో 1,228 చదరపు అడుగుల రెరా కార్పెట్ ఏరియాలో ఆఫీస్ స్థలాన్ని రూ.10.83 కోట్లకు ఆఫీస్ స్థలాన్ని కొనుగోలు చేశారు. ఈ యూనిట్ భవనంలోని మొదటి అంతస్తులో ఉంది. రిజిస్ట్రేషన్ కూడా పూర్తయింది. ఇందుకోసం 65 లక్షలకు పైగా స్టాంప్ డ్యూటీ, రూ.30వేల రిజిస్ట్రేషన్ ఫీజును వారు చెల్లించారు. నోటన్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వారు ఈ ఆఫీస్ యూనిట్ కొన్నారు. దీంతోపాటు రెండు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. కాగా, కార్తీక్ ఆర్యన్ తన తల్లిదండ్రులతో కలిసి ఈ ఏడాది సెప్టెంబర్ లో ముంబై అంధేరి వెస్ట్ లో రూ.13 కోట్లకు ఆఫీస్ స్థలాన్ని కొనుగోలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. ఇది సిగ్నేచర్ బై లోటస్ అనే భవనంలో ఉంది. రెరా-రిజిస్టర్డ్ కార్పెట్ ఏరియా 1,905 చదరపు అడుగులుగా ఉండగా.. దీంతోపాటు మూడు కార్ పార్కింగ్ స్థలాలు కూడా ఉన్నాయి. ఈ లావాదేవీకి రూ. 78 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30వేల రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారు. అలాగే కార్తీక్ అదే నెలలో ముంబైకి సమీపంలోని తీరప్రాంత పట్టణమైన అలీబాగ్‌లో రూ.2 కోట్ల విలువైన 2,000 చదరపు అడుగుల ప్లాట్‌ను కొనుగోలు చేశారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0