రూ.10 కోట్లతో ఆఫీస్ స్పేస్ కొన్న సింగర్

Playback singer Kailash Kher has purchased a ₹10.5 crore commercial office space in Mumbai’s premium BKC Trade Centre, acquiring a 2,619 sq ft unit with parking. This major real estate move adds to the growing trend of celebrities investing in high-value commercial properties. Here’s a detailed look at the transaction, stamp duty paid, and other Bollywood property purchases in 2024.

Nov 30, 2025 - 23:36
 0  63
రూ.10 కోట్లతో ఆఫీస్ స్పేస్ కొన్న సింగర్
kailash-kher-buys-10-crore-office-space-in-bkc-mumbai

ప్లేబ్యాక్ సింగర్ కైలాష్ ఖేర్ ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లోని ట్రేడ్ సెంటర్ అనే భవనంలో ఓ వాణిజ్య స్థలాన్ని కొనుగోలు చేశారు. రూ.10.5 కోట్ల వెచ్చించి అందులో ఆఫీస్ స్పేస్ కొన్నారు. ట్రేడ్ సెంటర్ భవనం ఏడో అంతస్తులో 2,619 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో ఆ యూనిట్ ఉంది. గతంలో ఐఎల్అండ్ఎఫ్ఎస్ కంపెనీ లిమిటెడ్ గా ఉండి ప్రస్తుతం ఎన్అండ్ టీ ఫ్యామిలీ ప్రైవేట్ ట్రస్ట్ గా మారిన సంస్థ నుంచి కైలాష్ ఆ ఆఫీస్ యూనిట్ ను కొన్నట్టు రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా తెలుస్తోంది. నవంబర్ 7న రిజిస్ట్రేషన్ జరగ్గా.. రూ.30వేల రిజిస్ట్రేషన్ ఫీజు, రూ.63 లక్షల స్టాంపు డ్యూటీని చెల్లించారు. ఆఫీస్ స్పేస్ తో పాటు ఒక కార్ పార్కింగ్ వచ్చింది. కాగా, ప్లేబ్యాక్ సింగర్ జుబిన్ నౌటియాల్  గతేడాది డిసెంబర్ లో ముంబైలోని మాధ్ ద్వీపం ప్రాంతంలో రూ.4.94 కోట్లకు 4 బీహెచ్ కే అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశారు. 

సముద్రానికి ఎదురుగా ఉన్న ఈ అపార్ట్ మెంట్ ముంబైలోని మాధ్ ద్వీపంలోని రహేజా ఎక్సోటికా భవనంలో ఉంది. 1,933 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ కు 200 చదరపు అడుగులకు పైగా డెక్ ఏరియా కూడా ఉంది. అలాగే గాయకుడుసంగీత దర్శకుడు, చిత్రనిర్మాత అవధూత్ గుప్తే, ఆయన భార్య గిరిజా గుప్తే గతేడాది అక్టోబర్ లో ముంబైలోని బాంద్రా సమీపంలోని ఖార్‌లో రూ.7.75 కోట్లకు ఒక అపార్ట్ మెంట్‌ను కొనుగోలు చేశారు. కాగా, బీకేసీ అనేది దేశంలోని అత్యంత ఖరీదైన వాణిజ్య జిల్లాల్లో ఒకటి. అనేక మంది బాలీవుడ్ తారలు బీకేసీలో పెట్టబుడులు పెట్టారు. 2024లో నటుడు మాధవన్ బీకేసీలో ఓ ప్రాపర్టీని రూ.17.5 కోట్లకు కొనుగోలు చేశారు.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0