బాలీవుడ్ దూకుడు
Bollywood stars invested nearly ₹100 crore in Mumbai real estate in November, boosting registrations by 20%. Saif Ali Khan, Hrithik Roshan, and Sushmita Sen’s family lead major property deals.
- నవంబర్ లో రూ.100 కోట్ల పెట్టుబడులు
రియల్ ఎస్టేట్ లో పెట్టుబడుల విషయంలో బాలీవుడ్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఒక్క నవంబర్ నెలలోనే పలువురు బాలీవుడ్ ప్రముఖులు ముంబైలో రూ.100 కోట్ల పెట్టుబడులు పెట్టారు. దీంతో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు గతేడాది నవంబర్ తో పోలిస్తే ఈ ఏడాది నవంబర్ లో 20 శాతం పెరిగాయి. గతనెలలో ఇక్కడ 12,219 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. తద్వారా స్టాంపు డ్యూటీ వసూళ్లు కూడా 12 శాతం మేర పెరిగి రూ.1,038 కోట్లకు చేరుకున్నాయి. సైఫ్ అలీ ఖాన్, హృతిక్ రోషన్, రోషన్ కుటుంబం, సుష్మితా సేన్ తల్లి సుబ్రా సేన్ వంటి ప్రముఖులు నవంబర్ లో ప్రాపర్టీలు కొనుగోలు చేశారు. సహా బాలీవుడ్ కుటుంబాలు ఆ నెలలో నగర ఆస్తి మార్కెట్లో దాదాపు ₹100 కోట్ల లావాదేవీలు చేశాయి.
సైఫ్ అలీ ఖాన్..
ముంబైలోని అంధేరిలోని రెండు కార్యాలయ యూనిట్లలో రూ.30.75 కోట్లు పెట్టుబడి పెట్టారు. కనకియా వాల్‌స్ట్రీట్ అనే భవనంలో 5,681 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రెండు యూనిట్లు, ఆరు కార్ పార్కింగ్ స్థలాలు ఇందులో ఉన్నాయి. అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ అపికోర్ ఫార్మాస్యూటికల్ నుంచి ఆయన వీటిని కొన్నట్టు రిజిస్ట్రేషన్ పత్రాల ద్వారా తెలుస్తోంది.
రోషన్ కుటుంబం..
హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్, ఆయన భార్య ప్రమీలా రాకేష్ రోషన్ తో కలిసి ముంబైలోని అంధేరి ప్రాంతంలో రూ. 19.68 కోట్లకు ఐదు వాణిజ్య కార్యాలయ యూనిట్లను కొనుగోలు చేశారు. వైద్య స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వైద్య వెస్ట్ వరల్డ్ వన్ ఏరోపోలిస్ అనే భవనంలో మొత్తం ఐదు కార్యాలయ యూనిట్లను కొనుగోలు చేశారు. అలాగే హృతిక్ రోషన్ సోదరి సునైనా రాకేష్ రోషన్ అదే భవనంలో రూ.6.42 కోట్లకు రెండు వాణిజ్య యూనిట్లను కొనుగోలు చేశారు. దీని తర్వాత హృతిక్ రోషన్, ఆయన తండ్రి రాకేష్ రోషన్ కు చెందిన హెచ్ఆర్ఎక్స్ డిజిటెక్ ఎల్ఎల్ పీ, ఆయన తల్లి ప్రమీలా రోషన్ కు చెందిన ఫిల్మ్ కుంజ్ (బాంబే) ప్రైవేట్ లిమిటెడ్ కలిసి ముంబైలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలో రూ.28 కోట్లకు 10 కార్యాలయ యూనిట్లను కొనుగోలు చేశాయి. ఇవి అంధేరి వెస్ట్ ప్రాంతంలోని యురా బిజినెస్ పార్క్ లో 3, 4 అంతస్తుల్లో ఉన్నాయి.
సుష్మితా సేన్ తల్లి సుబ్రా సేన్..
ప్రముఖ నటి సుష్మితా సేన్ తల్లి సుబ్రా సేన్ ముంబై గోరెగావ్ ఈస్ట్ లో రెండు ఫ్లాట్లను రూ.17 కోట్లకు కొనుగోలు చేశారు. ఒబెరాయ్ రియాల్టీకి చెందిన ఎలిసియన్ ప్రాజెక్టులో రెండు అపార్ట్ మెంట్లను రూ.16.89 కోట్లకు కొనుగోలు చేసినట్టు స్క్వేర్ యార్డ్స్ వెల్లడించింది. గతనెలలో ఈ రెండు అపార్ట్ మెంట్ల రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్టు పేర్కొంది. 163.59 చదరపు అడుగుల రెరా కార్పెట్ ఏరియా కలిగిన మొదటి అపార్ట్ మెంట్ ను రూ.8.4 కోట్లకు కొన్నారని.. ఈ లావాదేవీకి రూ. 42.02 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారని తెలిపింది. మొదటి అపార్ట్ మెంట్ విస్తీర్ణంలోనే ఉన్న రెండో అపార్ట్ మెంట్ ను రూ. 8.49 కోట్లకు కొనుగోలు చేశారని, దీంతోపాటు ఓ కార్ పార్కింగ్ స్థలం కూడా వస్తోందని స్క్వేర్ యార్డ్స్ వివరించింది. ఈ లావాదేవీలో రూ. 42.49 లక్షల స్టాంప్ డ్యూటీతో పాటు రూ. 0,000 రిజిస్ట్రేషన్ ఫీజులు ఉన్నాయని తెలిపింది.
ప్రాపర్టీ అమ్మిన అమితాబ్, ప్రీతిజింటా
బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముంబై గోరేగావ్‌లో రెండు లగ్జరీ అపార్ట్ మెంట్లను రూ.12 కోట్లకు విక్రయించారు. ఒబెరాయ్ ఎక్స్ క్విజిట్ అనే భవనంలోని 47వ అంతస్తులో పక్కపక్కనే ఉన్న ఈ రెండు ఫ్లాట్లను 2012లో రూ.8.12 కోట్లకు కొనుగోలు చేశారు. 13 ఏళ్ల తర్వాత వీటి విక్రయం ద్వారా 47% రాబడి పొందారు. అలాగే బాలీవుడ్ నటి ప్రీతి జింటా ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఒక అపార్ట్ మెంట్‌ను రూ.14.08 కోట్లకు విక్రయించారు. 1,474 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ అపార్ట్ మెంట్ రుస్తోంజీకి చెందిన పరిశ్రామ్ అనే భవనంలోని 11వ అంతస్తులో ఉంది. బాంద్రాలో మరో రూ.100 కోట్ల విలువైన ప్రాపర్టీని కొనుగోలు చేయనున్న ప్రీతి.. అందుకు ఈ సొమ్మును వెచ్చించనున్నట్టు సమాచారం.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0