రూ.547.75 కోట్లతో ఐదెకరాల స్థలం

Godrej Properties buys 5-acre land in Kokapet Neopolis for ₹547.75 crore to launch a ₹4,150 crore premium housing project near Hyderabad’s Financial District.

Dec 4, 2025 - 23:01
 0  19
రూ.547.75 కోట్లతో ఐదెకరాల స్థలం

-      హైదరాబాద్ లో రూ.4150 కోట్ల ప్రాజెక్టు కోసం కొన్న గోద్రేజ్ ప్రాపర్టీస్

ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ గోద్రేజ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ లో తన పోర్ట్ ఫోలియోను విస్తరిస్తోంది. రూ.4150 కోట్ల విలువైన ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టు కోసం రూ.547.75 కోట్లు వెచ్చించి ఐదెకరాల స్థలం కొనుగోలు చేసింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏనిర్వహించిన ఈ-వేలం ద్వారా హైదరాబాద్‌ కోకాపేటలోని నియోపోలిస్ లో 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ తెలిపింది. ఈ ల్యాండ్ పార్శిల్ లో ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టును నిర్మించనున్నట్టు పేర్కొంది. దాదాపు 2.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో విక్రయించదగిన స్పేస్ వస్తుందని.. ఈ ప్రాజెక్టుదాదాపు రూ.4,150 కోట్ల ఆదాయ సామర్థ్యం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీకి సమీపంలో ఉండటంబలమైన మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రపంచ సాంకేతిక సంస్థలుఅంతర్జాతీయ పాఠశాలలురిటైల్ అవెన్యూలు, ఆస్పత్రులు, అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థ కారణంగా కోకాపేటలోని నియోపోలిస్.. హైదరాబాద్‌లో డిమాండ్ ఉన్న మార్కెట్లలో ఒకటిగా ఉంది. కాగా, ఈ ఏడాది ఆగస్టులో కూకట్‌పల్లిలో దాదాపు 7.825 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన గోద్రేజ్ ప్రాపర్టీస్.. కోకాపేటలో గోద్రేజ్ మాడిసన్ అవెన్యూ, రాజేంద్ర నగర్‌లోని గోద్రేజ్ రీగల్ పెవిలియన్‌లను లాంచ్ చేసింది. తాజాగా కోకాపేట వేలంలో ఐదు ఎకరాలు కొని తన పోర్ట్ ఫోలియోను వేగంగా విస్తరిస్తోంది. ఇక 2025 క్యాలెండర్ సంవత్సరంలో హైదరాబాద్ లో రూ.2,600 కోట్లకు పైగా అమ్మకాలు జరిపింది. "హైదరాబాద్ బలమైన మౌలిక సదుపాయాల వృద్ధి, నాణ్యమైన గృహాలకు స్థిరమైన డిమాండ్‌తో పురోగతిలో సాగుతోంది. వ్యూహాత్మక సముపార్జనలు, విభిన్నమైన అభివృద్ధి ద్వారా ఈ మార్కెట్లో మా ఉనికిని బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఆలోచనాత్మకమైన డిజైన్, కస్టమర్-కేంద్రీకృత లక్షణాలను మిళితం చేసే ప్రాజెక్టులను అందించడంగృహ కొనుగోలుదారులకు దీర్ఘకాలిక విలువను సృష్టించడం మా లక్ష్యం" అని గోద్రేజ్ ప్రాపర్టీస్ ఎండీ, సీఈఓ గౌరవ్ పాండే అన్నారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో గోద్రేజ్ ప్రాపర్టీస్ అమ్మకాల బుకింగ్‌లలో 13 శాతం వృద్ధిని సాధించి రూ.15,587 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.13,835 కోట్లుగా ఉంది.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0