బెంగళూరులో కొత్తగా అద్దె స్కామ్
New rental scam surfaces in Bengaluru targeting tenants with fake gated community offers. Fraudsters demand ID and ₹2500 deposit. Stay alert and avoid cyber traps.
దేశంలో పలు రకాల సైబర్ నేరాలకు పాల్పడి భారీగా సొమ్ము కాజేస్తున్న నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి తెరతీశారు. అద్దెదారులను లక్ష్యంగా చేసుకుని నయా మోసానికి పాల్పడుతున్నారు. బెంగళూరులో ఇలాంటి మోసాన్ని ఛేదించిన ఓ నెటిజన్ ఆ వివరాలు వెల్లడిస్తూ.. జనం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అన్ని సౌకర్యాలు, ఫర్నిషింగ్ తో కూడిన 2 బీహెచ్ కే రూ.15వేలకు అద్దెకు లభిస్తోందని రియల్ ఎస్టేట్ ఫ్లాట్ ఫారమ్స్ లో ప్రకటన ఇస్తారు. బెంగళూరు వంటి నగరంలో ఇది ఆకర్షణీయంగా కనపడటంతో నిజమే అనుకుని అక్కడ ఇచ్చిన ఫోన్ నంబర్ కు కాల్ చేసి వివరాలు అడుగుతారు. యజమానిగా చెప్పుకున్న అవతలి వ్యక్తి.. అది గేటెడ్ కమ్యూనిటీ అయినందున సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం ముందుగానే ఎంట్రీ ఐడీ కార్డ్ జనరేట్ చేయాల్సి ఉంటుందని, అందుకోసం ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు, ఫొటో షేర్ చేయమని అడుగుతాడు. ఎంట్రీ పాస్ జనరేషన్ కోసం రూ.2500 రిఫండబుల్ డిపాజిట్ చేయాలని కోరతాడు. అవన్నీ నిజమే అని నమ్మి మనం డబ్బు బదిలీ చేస్తే అక్కడితో సదరు స్కామర్ పని పూర్తవుతుంది. మళ్లీ అతడి నుంచి ఎలాంటి కాల్ రాదు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని.. డబ్బులు పోవడమే కాకుండా మన ఐడీ, ఫొటోలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని సదరు నెటిజన్ హెచ్చరిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పలువురు స్పందించారు. ఇటీవల ఇలాంటి స్కామ్స్ ఎక్కువయ్యాయని పేర్కొన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0