దుబాయ్ లోకి కాసా‘గ్రాండ్’ ఎంట్రీ
Bengaluru-based Casagrand makes a grand entry into Dubai with a ₹1,000 crore luxury residential project on Dubai Islands, targeting global buyers.
- రూ.1000 కోట్ల లగ్జరీ ప్రాజెక్టుతో ప్రవేశం
బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్ కాసాగ్రాండ్.. దుబాయ్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. దాదాపు రూ.1000 కోట్ల ప్రాజెక్టుతో అక్కడి మార్కెట్లోకి ప్రవేశించింది. దుబాయ్ ఐలాండ్స్ లో కాసాగ్రాండ్ హెర్మినా అనే పేరుతో చేపట్టిన ఈ లగ్జరీ ప్రాజెక్టులో 827 చదరపు అడుగుల నుంచి 2,536 చదరపు అడుగుల వరకు బేస్ మెంట్+గ్రౌండ్ + 13 అంతస్తుల్లో 131 ప్రీమియం నివాసాలు ఉంటాయి.
వచ్చే మూడళ్లలో యూఏఈలో 6 మిలియన్ చదరపు అడుగుల ప్రీమియం ప్రాజెక్టులు చేపట్టాలని కంపెనీ యోచిస్తోంది. పలు అంశాలను పరిశీలించిన తర్వాతే దుబాయ్ ను ఎంచుకున్నట్టు కాసాగ్రాండ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ ఎంఎన్ తెలిపారు. “కాసాగ్రాండ్ హెర్మినాతో సముద్ర తీర ప్రశాంతతను ఆధునిక పట్టణ కేంద్ర శక్తితో విలీనం చేశాం. ప్రపంచ గృహ కొనుగోలుదారులను ఆకర్షించే, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఇళ్లను సృష్టించాలనే నిబద్ధతకు కట్టుబడి ఉన్నాం’ అని పేర్కొన్నారు. దుబాయ్ 2040 అర్బన్ మాస్టర్ ప్లాన్ కింద దుబాయ్ దీవులు వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్న నేపథ్యంలో అక్కడకు కాసాగ్రాండ్ ప్రవేశించింది. ఈ జిల్లాలో 21 కిలోమీటర్ల బ్లూ ఫ్లాగ్-సర్టిఫైడ్ బీచ్‌లు, తొమ్మిది మెరీనాలు, 80కి పైగా ప్రణాళికాబద్ధమైన హోటళ్ళు, రెండు గోల్ఫ్ కోర్సులు ఉంటాయి. 2026 నాటికి దీవులను డౌన్‌టౌన్ దుబాయ్‌కు అనుసంధానించే ఎనిమిది లేన్ల వంతెన, ప్రతిపాదిత మెట్రో లింక్‌తో సహా రాబోయే కనెక్టివిటీ అప్‌గ్రేడ్‌లు ఈ ప్రాంతంలో డిమాండ్‌ను పెంచుతాయని భావిస్తున్నారు. కాగా, గత నెలలో కాసాగ్రాండ్ బ్లాక్‌స్టోన్‌తో వ్యూహాత్మక పెట్టుబడి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా బ్లాక్ స్టోన్ కంపెనీ చెన్నై సమీపంలో 4.2 మిలియన్ చదరపు అడుగుల పారిశ్రామిక, గిడ్డంగుల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టడానికి అంగీకరించింది. చెన్నైలోని శ్రీపెరంబుదూర్‌లో 154 ఎకరాల విస్తీర్ణంలో రెండు పెద్ద ఎత్తున పారిశ్రామిక మరియు లాజిస్టిక్స్ పార్కులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని కాసాగ్రాండ్ తెలిపింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0