ముంబైలో రిజిస్ట్రేషన్లు పైపైకి..

Mumbai records highest-ever property registrations with ₹12,224 crore revenue in 2025, reflecting booming demand across major markets like Hyderabad real estate.

Dec 6, 2025 - 22:19
 0  8
ముంబైలో రిజిస్ట్రేషన్లు పైపైకి..
Mumbai-records-highest-ever-property-registrations

-      నవంబర్ లో ఆల్ టైమ్ గరిష్టానికి ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. ఈ ఏడాది మొదటి 11 నెలల్లో 1,35,800కి పైగా రిజిస్ట్రేషన్లు నమోదు కాగా, రాష్ట్ర ఖజానాకు రూ.12,224 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే ఒక్క నవంబర్ లో 12,219 రిజిస్ట్రేషన్లను జరిగాయి. వార్షిక ప్రాతిపదికన ఇది 20 శాతం పెరుగుదల కాగా, స్టాంప్ డ్యూటీ వసూళ్లు 12 శాతం పెరుగుదలతో రూ.1,038 కోట్లకు చేరుకున్నాయని నైట్ ఫ్రాంక్ తాజా నివేదిక వెల్లడించింది. రిజిస్ట్రేషన్లకు సంబంధించి నెలవారీగా చూస్తే నవంబర్ లో 5 శాతం పెరుగుదల కనిపించింది. ఇక నవంబర్ లో జరిగిన అన్ని రిజిస్ట్రేషన్లలో 80 శాతం రెసిడెన్షియల్ విభాగానివే. మొత్తమ్మీద 2025 11 నెలల్లో ముంబైలో 1,35,807 రిజిస్ట్రేషన్లు నమోదు కాగా, రూ.12,224 కోట్ల ఆదాయం వచ్చింది. వార్షిక ప్రాతిపదికన ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు 5 శాతం వృద్ధి నమోదు చేయగా.. ఆదాయం 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. నవంబర్ లో జరిగిన మొత్తం రిజిస్ట్రేషన్లలో రూ.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల వాటా 7 శాతంగా ఉంది. గతేడాది ఇదే సమయంలో ఇది 5 శాతంగా ఉంది. అదే సమయంలో రూ.కోటి కంటే తక్కువ ధర ఉన్న ఇళ్ల వాటా తగ్గింది.  రూ.25 కోట్ల శ్రేణి స్థిరంగా ఉంది. అయితే రూ.కోటి నుంచి రూ.2 కోట్ల విలువైన ఆస్తుల వాటా 2024లో 31% ఉండగా.. 2025లో 33 శాతానికి పెరిగిందని నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో 1,000 చదరపు అడుగుల వరకు ఉన్న ప్రాపర్టీల వాటా 84 శాతంగా ఉంది. 1,0002,000 చదరపు అడుగుల యూనిట్ల వాటా 12 శాతం ఉండగా.. 2,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న అపార్ట్ మెంట్లు 4% ఉన్నాయి. ముంబై రెసిడెన్షియల్ మార్కెట్ నవంబర్ వరకు స్థిరమైన పనితీరు కనబరిచింది. రిజిస్ట్రేషన్లలో 20% వార్షిక పెరుగుదలను నమోదు చేసింది. 2013 నుంచి చూస్తే.. ఈ ఏడాది నవంబర్ అద్భుతంగా ఉంది అని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజల్ పేర్కొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0