షారుక్జ్.. సోల్డ్ అవుట్

Dec 17, 2025 - 12:02
 0  10
షారుక్జ్.. సోల్డ్ అవుట్
షారుక్జ్.. సోల్డ్ అవుట్

-      దుబాయ్ లో షారుక్ పేరుతో కొత్త టవర్ లాంచ్

-      వెంటనే ప్లాట్లన్నీ అమ్ముడైనట్టు డెవలపర్ వెల్లడి

దుబాయ్ లో తన పేరుతో నిర్మించనున్న 55 అంతస్తుల ప్రాజెక్టును ప్రముఖ నటుడు షారుక్ ఖాన్ ఘనంగా లాంచ్ చేశారు. భారతీయ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త, డాన్యూబ్ గ్రూప్ వ్యవస్థాపకుడు రిజ్వాన్ సాజన్.. షేక్ జాయెద్ రోడ్‌లో డాన్యూబ్ షారుఖ్జ్ పేరుతో దీనిని నిర్మిస్తున్నారు. అత్యంత అట్టహాసంగా జరిగిన లాంచ్ ఈవెంట్ కు దాదాపు 6500 మంది హాజరయ్యారు. ఈ ప్రాజెక్టుకు బలమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే రూ.5వే కోట్ల విలువైన బుకింగ్స్ జరిగి, మొత్తం ఫ్లాట్లు అమ్ముడుపోయినట్టు రిజ్వాన్ చెప్పారు. 2029 నాటికి ఈ టవర్ పూర్తవుతుందని వెల్లడించారు. టవర్ ఎంట్రన్స్ వద్ద చేతులు చాచి ఉన్న భంగిమలో షారుఖ్ ఖాన్ విగ్రహం ఉంటుందన్నారు. షారుక్ ఖాన్ పేరుతో త్వరలోనే రెండో టవర్ కూడా నిర్మిస్తామని తెలిపారు. న్యూయార్క్లండన్ఢిల్లీ, ముంబైలలో ఇలాంటి 'షారుఖ్జ్టవర్లను ప్రారంభించాలని యోచిస్తున్నట్టు చెప్పారు. దుబాయ్‌లో ఈ స్థాయిలో ఉన్న ప్రాజెక్టును చూడటం, దీనికి నా పేరు పెట్టడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. దుబాయ్ ఎల్లప్పుడూ నన్ను హృదయపూర్వకంగా స్వాగతిస్తుంది. ఇది ధైర్యంఊహ, ఏదీ అసాధ్యం కాదనే నమ్మకంపై నిర్మించిన నగరం" అని షారుఖ్ ఖాన్ అన్నారు. కాగా, దుబాయ్ లో నిర్మిస్తున్న షారుఖ్జ్ బై డాన్యూబ్ ప్రాజెక్టు ఒక మిలియన్ చదరపు అడుగులకు పైగా బిల్టప్ ఏరియాతో ఉంది. ఇందులో మొత్తం 488 యూనిట్లు ఉంటాయి. వీటి ధరలు రూ.2 మిలియన్ దీరమ్స్ తో మొదలవుతాయి. ఈ ప్రాజెక్టు మొత్తం విలువ రూ.5వేల కోట్లు అని అంచనా. ఈ టవర్‌లో 35కి పైగా ఎమినిటీస్ ఉంటాయి. స్కై పూల్ఎయిర్ టాక్సీల కోసం ప్రత్యేక హెలిప్యాడ్వాలెట్ సేవలు మరియు ప్రత్యేకమైన ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు ఉన్నాయని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ఉన్న షేక్ జాయెద్ రోడ్డులో బుర్జ్ ఖలీఫాతో సహా దుబాయ్‌లోని అత్యంత ప్రసిద్ధ భవనాలు కొన్ని ఉన్నాయి. షారుఖ్జ్ టవర్‌లో పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణం ఉంటుందని డెన్యూబ్ తెలిపింది. కాగా, అర్హులైన పెట్టుబడిదారులకు 1% నెలవారీ చెల్లింపు ప్రణాళిక, 10 సంవత్సరాల గోల్డెన్ వీసాను కంపెనీ అందిస్తుంది. వాణిజ్య యూనిట్ల పరిమాణాలు 460 చదరపు అడుగుల నుంచి 11,000 చదరపు అడుగుల వరకు ఉంటాయి. కొనుగోలుదారులు 20% డౌన్ పేమెంట్ చెల్లించి ఆ తర్వాత ఆరు సంవత్సరాల పాటు రూ.4 కోట్ల ధరలో 1% చొప్పున నెలవారీ వాయిదాలు చెల్లించాలి.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0